Social 1080×1350 • Multi-page
23-09-2024 BREAKING NEWS 07:57 AM
swarnodayam.com
Telugu Daily News

క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వడం అందరి బాధ్యత -చైర్ పర్సన్ గందె రాధిక

క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వడం అందరి బాధ్యత -చైర్ పర్సన్ గందె రాధిక
IMG_20240923_185340

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: చదువుకునే సమయంలో బాలబాలికలకు క్రీడల పట్ల ఆసక్తి పెంచాలని, క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం ఇవ్వడం మనందరి బాధ్యత అని హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక శ్రీనివాస్ అన్నారు. సోమవారం హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి పాఠశాలల కబడ్డీ పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హుజురాబాద్ క్రీడాకారులకు నిలయమని, ఈ ప్రాంతంలో కబడ్డీ, కోకో, హాకీ, బాస్కెట్ బాల్, ఫుట్బాల్ తదితర క్రీడల్లో క్రీడాకారులు ఎక్కువగా ఉన్నారని అన్నారు. క్రీడాకారులకు సైతం ఆదరణ ఎక్కువగా ఉంటుందని అన్నారు. జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు 32 బాలికలు 32 బాలుర టీములు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి కొమ్మేర శ్రీనివాస్ రెడ్డి, ఎస్ జిఎఫ్ కార్యదర్శి, ఫిజికల్ డైరెక్టర్ సొల్లు సారయ్య, ప్రధానోపాధ్యాయురాళ్ళు శోభారాణి, తిరుమల, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, విడపు శ్రీనివాస్, పిడి లు వేణు, నరసయ్య, ఏ శ్రీనివాస్, చిరుత శ్రీనివాస్, కాల్వ రేణుక, డి సత్యానందం, సొల్లు అనిల్ కుమార్, పలువురు ఉపాధ్యాయులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.

హోరా హోరిగా జరిగిన పోటీలో హుజురాబాద్ విజేత!

జిల్లా స్యి కబడ్డీ పోటీలలో చొప్పదండి వర్సెస్ హుజురాబాద్ హోరాహరీగా తలపడగా చివరికి విన్నర్ గా హుజురాబాద్ నిలచింది. విజేతలకు ముఖ్య అతిథులుగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ గందే రాధిక, కబడ్డీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు హుజురాబాద్ క్లబ్ అధ్యక్షుడు కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఏంఇఓ శ్రీనివాసరెడ్డి తదితరులు విజేతలకు బహుమతులు అందజేశారు. ఇక్కడ విజేతలైన వారిని జోనల్ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకుడు, కబడ్డీ అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ సొల్లు సారయ్య తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!