Social 1080×1350 • Multi-page
24-09-2024 BREAKING NEWS 05:25 AM
swarnodayam.com
Telugu Daily News

శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ జాతీయ సేవా పథకం ఆవిర్భావ వేడుకలు

శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ జాతీయ సేవా పథకం ఆవిర్భావ వేడుకలు
IMG_20240924_161958

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి,హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ జాతీయ సేవా పథకం ఆవిర్భావ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఏనుగు మైపాల్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ యువత సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. చదవడం కాకుండా సమాజం పట్ల అవగాహన అవసరం అన్నారు. ప్రిన్సిపల్ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తమ విద్యార్థులుగా ఎదగాలంటే క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, పట్టుదల, త్యాగం, శీలం విద్యార్థులకు పట్టుకొమ్మలు అన్నారు. నేటి యువతరం దేశ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్, తెలుగు అధ్యాపకులు మేకల నవీన్ కుమార్ ఎన్ఎస్ఎస్ గురించి ఎన్ఎస్ఎస్ గీతాలను ఆలపించారు. ఎన్ఎస్ఎస్ సేవా భావాల గురించి క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ మహిపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ ప్రవీణ్ రెడ్డితో పాటు అధ్యాపకులు నవీన్ కుమార్, భద్రయ్య, తిరుపతి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!