Social 1080×1350 • Multi-page
24-09-2024 BREAKING NEWS 05:57 AM
swarnodayam.com
Telugu Daily News

కనుకులగిద్దలో ఘనంగా బొడ్డెమ్మ వేడుకలు

కనుకులగిద్దలో ఘనంగా బొడ్డెమ్మ వేడుకలు
IMG-20240924-WA0044

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ మండలంలోని కనుకులగిద్ద గ్రామంలో మహిళ మాతృశక్తి ఆధ్వర్యంలో మంగళవారం బొడ్డెమ్మ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ మహిళా మాతృశక్తి గ్రామ అధ్యక్షురాలు లింగాల రజిత మాట్లాడుతూ బొడ్డెమ్మ పండుగ అంటే ఏమిటి? దాని విశిష్టతను ప్రజలకు వివరించారు. అలాగే బొడ్డెమ్మ పండుగను కన్నెపిల్లలు చేసుకునే పండగ అని, వినాయక చవితి పండుగ తర్వాత వచ్చే భాద్రపద బహుళ పంచమి నుండి తొమ్మిది రోజులు అనగా అశ్వయుజ శుద్ధ పాడ్యమికి ముందు వచ్చే అమావాస్య వరకు జరుపుకునే పండుగ అని లేదా చిన్న బతుకమ్మ వచ్చేవరకు జరుపుకునే పండుగ అని తెలిపారు. ఆ తర్వాత మహిళలందరూ కలిసి స్థానిక పుట్ట దగ్గరికి వెళ్లి, పుట్టను తవ్వి మట్టి తీసి బొడ్డెమ్మను తయారు చేశారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ మండల అధ్యక్షుడు కంకణాల రమేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా కనుకులగిద్ద గ్రామంలో బొడ్డెమ్మ వేడుకలను ఘనంగా జరుపుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ మాతృశక్తి గ్రామ శాఖ అధ్యక్షురాలు లింగాల రజిత, కంకణాల లక్ష్మి, లింగాల నీరజ, జాలి లక్ష్మీ, రెడ్డి కవిత, ములుగు రాజేశ్వరి, లింగాల లావణ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!