Social 1080×1350 • Multi-page
26-09-2024 BREAKING NEWS 03:27 AM
swarnodayam.com
Telugu Daily News

హెచ్ ఐవి, ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ.. – సుఖ వ్యాధులతో బాధపడే ప్రతి ఒక్కరు హెచ్ ఐవి స్క్రీనింగ్ చేపించుకోవాలి.. -జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ సంస్థ డీపీఎం సురేందర్ రెడ్డి

హెచ్ ఐవి, ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ.. – సుఖ వ్యాధులతో బాధపడే ప్రతి ఒక్కరు హెచ్ ఐవి స్క్రీనింగ్ చేపించుకోవాలి.. -జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ సంస్థ డీపీఎం సురేందర్ రెడ్డి
IMG_20240926_142524

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సుఖ వ్యాధులతో బాధపడే ప్రతి ఒక్కరు హెచ్ ఐవి స్క్రీనింగ్ చేపించుకోవాలనీ జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ సంస్థ డీపీఎం సురేందర్ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక ఏరియా హాస్పిటల్ లోని ఐసిటీసీ ఆధ్వర్యంలో హెచ్ ఐవి, ఎయిడ్స్, సుఖవ్యాధులపై ర్యాలీ నిర్వహించారు. ఏరియా హాస్పిటల్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నర్సింగ్, ల్యాబ్ స్టూడెంట్స్, విద్యార్థులతో ఎయిడ్స్ నివారణపై నినాదాలు చేస్తూ, పాటల రూపంలో అవగాహన కల్పించారు. కరపత్రాలు, ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సంద్భర్బంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ హెచ్ ఐవితో బాధ పడే ప్రతి ఒక్కరూ విధిగా ఏఆర్ టి మందులు వాడాలని కోరారు. హుజూరాబాద్ ఏరియా హాస్పిటల్ లో ఏ ఆర్ టి మందులు అందుబాటు లో ఉన్నాయన్నారు. HIV తో జీవిస్తున్న వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఏ ఆర్ టి మందులు వాడుతూ పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా జీవిత కాలం జీవించవచ్చన్నారు. HIV గురించి సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 ద్వారా సంప్రదించవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజేందర్ రెడ్డి, ఆర్ ఎంఓ సుధాకర్ రావు, డాక్టర్ నారాయణరెడ్డి, జిల్లా ఐసిటిసి సూపర్వైజర్ పిఆర్ శ్రీనివాస్, ఐసిటిఎస్ కౌన్సిలర్ బి.సుజాత, ల్యాబ్ టెక్నీషియన్ జీ.ప్రశాంత్, ఎస్ టి ఎస్లు దేవేందర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, సులోచన, ఉమ, రవీందర్, భాస్కర్, శంకర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!