Social 1080×1350 • Multi-page
26-09-2024 BREAKING NEWS 05:31 AM
swarnodayam.com
Telugu Daily News

స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరం

స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరం
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రభుత్వము వారు ప్రతీష్టాత్మకముగా ప్రవేశపెట్టిన స్వచ్ఛతాహీ సేవా –2024 కార్యక్రమములో భాగంగా పురపాలక సంఘ చైర్ పర్సన్ శ్రీమతి గందె రాధిక ఆధ్వర్యంలో కార్యాలయము ఆవరణంలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య, నీటి సరఫరా కార్మికులకు మరియు కార్యాలయ సిబ్బందికి చెల్పూర్ పిహెచ్సి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించారు. ముందుగా ఈ వైద్య శిబిరాన్ని చైర్పర్సన్ గందే రాధిక, కమిషనర్ ఎస్ సమయ్యలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వైద్యులు BP, షుగర్ మరియు ఇతరత్ర వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. చైర్ పర్సన్ రాధిక మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసే ఉచిత వైద్య శిబిరాలను మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు, సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమములో హుజురాబాద్ పురపాలక సంఘ గౌరవ వార్డు సభ్యులు, కమిషనర్ సల్వాది సమ్మయ్య, కార్యాలయ మేనేజర్ ఆర్. భూపాల్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ యం. కిషన్ రావు, చెల్పూర్ పిహెచ్సి వైద్యులు డా. జరీనా, డా. స్నిగ్ధ , ANM విజయలక్ష్మీ, కృష్ణ కుమారి, మెడికల్ హెల్త్ అసిస్టెంట్ కే సత్యం, ఆశా కార్యకర్తలు శశికళ, అరుణ, శారద, స్వప్న రామ, వార్డు అధికారులు, సానిటరీ జవాన్లు, మెప్మా RPలు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!