26-09-2024 NORMAL NEWS 06:04 AM
swarnodayam.com
Telugu Daily News
26-09-2024 06:04 AM By Mandala Yadagiri

విఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో చాకలి ఐలమ్మ జయంతి

విఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో చాకలి ఐలమ్మ జయంతి
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి, హుజురాబాద్ సెప్టెంబర్ 26: హుజురాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలోని విఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో గురువారం ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇన్చార్జి ప్రిన్సిపల్ శనిగరపు రజిత మాట్లాడుతూ.. సాయుధ పోరాటంలో, నాటి నిజాం నిరంకుశ పాలనకు, భూస్వాముల అరాచకానికి వ్యతిరేకంగా ఐలమ్మ ఉద్యమించిందని అన్నారు. వీరనారి ఐలమ్మను మహిళలు అంతా ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఐలమ్మ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేటి తరం చైతన్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రిన్సిపాల్ శనిగరపు రజిత, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ గబ్బేటి తిరుపతి, కో -ఆర్డినేటర్ పోతిరెడ్డి హరీష్, తాళ్లపల్లి అజయ్, గట్టు కోమల, శారదా, గణేష్, సతీష్, మహేష్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!