26-09-2024 NORMAL NEWS 06:35 AM
swarnodayam.com
Telugu Daily News
26-09-2024 06:35 AM By Mandala Yadagiri

ఎన్ఎస్ యుఐ జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎన్ఎస్ యుఐ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు మహమ్మద్ ఇమ్రాన్

ఎన్ఎస్ యుఐ జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎన్ఎస్ యుఐ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు మహమ్మద్ ఇమ్రాన్
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ఈరోజు ఎన్ఎస్ యుఐ జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరిని ఎన్ఎస్ యుఐ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు మహమ్మద్ ఇమ్రాన్ మరియు ఎన్ఎస్ యు ఐ కరీంనగర్ జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మొహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా నుండి పెద్ద ఎత్తున ఎన్ఎస్ యుఐ నాయకులు మరియు కార్యకర్తలు ఢిల్లీలో జరుగుతున్న DUSU ( ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్) ఎలక్షన్స్ కొరకు దాదాపుగా పది రోజుల నుండి భారత రాజధాని అయిన ఢిల్లీలో ఢిల్లీ యూనివర్సిటీ ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తూ ఢిల్లీ యూనివర్సిటీలో ఎన్ఎస్ యుఐ జెండా ఎగరవేయడానికి కృషి చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి మరియు కరీంనగర్ జిల్లా నుండి ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న తెలుగు విద్యార్థిని విద్యార్థులను కలిసి ఎన్ఎస్ యుఐ మేనిఫెస్టో గురించి వివరిస్తూ వాటి అంశాలైన అందరికీ తెలియజేయడం జరిగిందన్నారు. అందుబాటులో విద్య, విద్వేషపూరితమైన వాటిని రెచ్చగొట్టే విభజన శక్తుల నుండి క్యాంపస్ ని కాపాడడం, స్త్రీలకు ఆరోగ్యం మరియు శ్రేయస్సును పెంపొందించడానికి ఒక సెమిస్టర్ కు 12 రోజుల ఋతుస్రావం సెలవును ప్రవేశపెట్టడం, ఆడ మగ తారతమ్యం లేకుండా మెంటల్ హెల్త్ చెకప్ లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మరిన్ని స్కాలర్‌షిప్ అవకాశాలను అందించడం జరుగుతుందన్నారు. మరియు OBC విద్యార్థులు వారి విద్యకు మద్దతుగా ఉండటం, అన్ని క్యాంపస్‌లకు షటిల్ బస్సు సేవలను అందుబాటులోకి తెచ్చి, మెట్రో స్టేషన్‌లకు అందుబాటులో ఉండేలా చేయడం, హాస్టల్ కేటాయింపు ప్రక్రియ సమయంలో OBC రిజర్వేషన్లు సమర్థించబడటం ద్వార న్యాయమైన హాస్టల్ కేటాయింపు చేయించడం, ఫిర్యాదుల పరిష్కారం కోసం సెల్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయడం ద్వారా హింస రహిత క్యాంపస్ నీ సృష్టించడం, విద్యార్థులకు ఉచిత మెట్రో పాస్‌లు అందించి, వారి ఆర్థిక భారాన్ని తగ్గించడం, విద్యార్థుల కోసం అన్ని క్యాంపస్‌లలోని లైబ్రరీలకు ఎల్లవేళలా యాక్సెస్ ఉండేలా చూసుకోవడం, విద్యార్థుల సౌకర్యార్థం రైల్వే రిజర్వేషన్ గణనలను ఏర్పాటు చేయడం, జాతీయ ప్లేస్మెంట్ సెల్లు ఏర్పాటు చేయడం, ఉచితంగా వైఫై ని ఏర్పాటు చేయడం ద్వారా అవసరమైన అభ్యాసం మరియు పరిశోధనకు ఉపయోగ కోసం ప్రయత్నించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను అందించడానికి క్యాంపస్ మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయటం, మన తెలుగువారికి కావలసిన వంటకాలతో కూడిన మెస్ మరియు అన్ని రాష్ట్రాల వారికే కావాల్సిన తెలంగాణ భవన్ లాంటి భోజన వసతి కలిగిన మెస్ లను ఏర్పాటు చేయడం, మన ఢిల్లీ యూనివర్సిటీ కి సంబంధించిన ఫండ్స్ ని పారదర్శకంగా వాడుకోవడం గురించి న విషయాన్ని ప్రతి ఒక్క విద్యార్థి దృష్టికి తెలియజేయడం జరిగిందన్నారు. యువ ప్రతిభను, ఉత్సాహపూరితమైన పోటీల పోటీలు మరియు ఆకర్షణీయమైన కార్యకలాపాల ద్వారా చురుకైన భాగస్వామ్యాన్ని ప్రేరేపించడానికి ప్రతి సంవత్సరం నేషనల్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఫెస్టివల్‌ను నిర్వహించడం వంటి వాటి గురించి ప్రతి ఒక్క విద్యార్థికి తెలియజేశామన్నారు. ఎన్ఎస్ యుఐ నుండి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న రొనల్ ఖాత్రి ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న యశ్ నందల్ కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్న మహిళ నమ్రత జెఫ్ మరియు సంయుక్త కార్యదర్శిగా పోటీ చేస్తున్న లోకేష్ చౌదరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరామన్నారు. తద్వారా ఎన్ఎస్ యుఐ జెండాని ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ లో ఎగురవేయాలని కోరుకుంటున్నానని మాట్లాడడం జరిగిందనీ ఇమ్రాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు మహమ్మద్ ఇమ్రాన్ తో పాటు కరీంనగర్ జిల్లా కార్యదర్శి పల్నాటి అభిలాష్, ఎన్ఎస్యుఐ నాయకులు సమీర్, ఫహద్ , రాజేష్, అరవింద్, అవినాష్, అజయ్ , అశోక్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!