Social 1080×1350 • Multi-page
26-09-2024 BREAKING NEWS 08:54 AM
swarnodayam.com
Telugu Daily News

ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పెట్టండి.. ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.

ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పెట్టండి.. ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.
IMG-20240926-WA0158

స్వర్ణోదయం ప్రతినిధి, హైద‌రాబాద్,సెప్టెంబర్ 26:
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు, డివిజన్, మండల, అధికారులకు ఈరోజు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం ఫైనల్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించాలని కాంగ్రెస్ సర్కార్ ఆదేశించింది. అక్టోబర్ 7వ తేదీలోపు అన్ని ప్రభుత్వ కార్యాల యాల్లో ముఖ్యమంత్రి కొత్త ఫోటో ఏర్పాటు చేయాలని కోరింది. ఈ మేర‌కు జిల్లా కలెక్టర్లు, డివిజన్, మండల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

సీఎం రేవంత్ రెడ్డి ఫోటో నమూనాను కూడా విడుదల చేస్తూ ప్రభుత్వం కార్యాలయాల్లో సీఎం పెట్టా లని తెలిపింది. ఇప్పటికే కొందరు నాయకులు ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫోటో లేదనే వాదనపై ప్రభుత్వం స్పందించింది. దీంతో వచ్చే నెల 7వ తేదీ వరకు గడువు ఇస్తూ ఆదే శించింది. అన్ని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త ప్రభు త్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తి అయిన ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను అన్ని ప్రభుత్వ కార్యాయాల్లో సీఎం ఫోటో ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ అక్టోబర్ 7వరకు గడువు ఇచ్చింది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!