
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి ఎల్కతుర్తి:
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరంలా నిలిచిందని జగన్నాధపురం గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కే శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 26 వేల రూపాయల విలువ గల చెక్కును లబ్ధిదారు బుధవారం గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పెండ్యాల కుమారస్వామి, ఆరేపల్లి సమ్మయ్య, ఆరెపల్లి చిరంజీవి, మాజీ ఉప సర్పంచులు ఆరెపల్లి సమ్మయ్య, ఆరేపల్లి రమేష్, మాజీ వార్డు సభ్యులు పెండ్యాల భాస్కర్, పెండ్యాల సామేల్, బండి కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండాల మధు, గూటం శ్రీనివాస్ రెడ్డి, జిఎస్ రెడ్డి, మాటూరి శ్రీనివాస్, శివరాత్రి మల్లయ్య, అరెపల్లి ఎల్లయ్య, కంసారపు సంపత్, పెండ్యాల పౌలు, ఆరెపల్లి కళ్యాణ్, ఎస్.డి హుస్సేన్, ఎస్డి కరీం, మేకల రాజు, కాంగ్రెస్ యువజన నాయకులు పంజాల అభిలాష్, పెండ్యాల రాజేష్ తదితరులు ఉన్నారు.


ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 26 వేల రూపాయల విలువ గల చెక్కును లబ్ధిదారులకు అందజేస్తున్న కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్..





