
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదిన వేడుకలు శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అయన నిండా నూరేళ్లు జీవించాలని, మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని పేర్కొంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని, కౌన్సిలర్లు కో ఆప్షన్ నెంబర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.





