
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట): జమ్మికుంట స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హాకీ మాంత్రికుడు, భారతదేశం గర్వించదగిన క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఈ సందర్భంగా క్రీడల ప్రాధాన్యత, యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరం, క్రీడాకారులకు ప్రభుత్వం మరియు సమాజం నుంచి అందాల్సిన ప్రోత్సాహంపై పలువురు మాట్లాడారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాకీ జాతీయ క్రీడాకారులు, మాజీ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, క్రీడాకారులు బండ సాయి, జమ్మికుంట స్పోర్ట్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గండికోట సమ్మయ్య, డాక్టర్ అంబాల ప్రభాకర్, వంతడుపుల రఘు, బుర్ర కుమార్, తిరుపతి శ్రీనివాస్, కౌన్సిలర్ కొలుగూరి సురేష్, మంద రాజేష్, కంకణాల బిక్షపతి, దామెర శ్యామ్, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్, బీఎస్పీ సీనియర్ నాయకులు మారపల్లి మొగులయ్య, గంగారపు రాజయ్య, రాజపల్లి గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి, ఎమ్మార్పీఎస్ నాయకురాలు లక్ష్మి, శనివారం భాస్కర్, శనిగరపు జైపాల్, పూలల ప్రశాంత్, పంజాల అరవింద్, మైస వంశీ, గూడెల్లి సాయి, పంజాల శ్రీరామ్, భరత్ తదితరులు పాల్గొన్నారు.





