
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (హనుమకొండ): బీసీఆజాది ఫెడరేషన్ హుజురాబాద్ డివిజన్ అధ్యక్షులు పంజాల తిరుపతి గౌడ్ కుమారుని నిశ్చితార్థ వేడుకలు హనుమకొండ ఎర్రగట్టు గుట్ట సమీపంలోని మిత్ర ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగాయి.
ఈ వేడుకకు బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుడికాల భాస్కర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జినుకల లక్ష్మణరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుకమరి శ్రీనివాస్ తదితర ముఖ్య నేతలు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.

నూతన జీవితంలోకి అడుగుపెడుతున్న జంటకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని నాయకులు ఆకాంక్షించారు. తిరుపతి గౌడ్ కుటుంబ సభ్యులకు తమ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు మరియు శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.


కాబోయే నూతన వధూవరులు..





