Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ శివారులోని పరకాల క్రాస్ రోడ్ వద్ద ఒక హోటల్ వద్ద ఉన్న గోస్కుల సక్కమ్మ అనే గృహిణి మెడలో పుస్తెలతాడు గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు గురువారం రాత్రి చోరీ చేశారు.

బాధితురాలు సక్కమ్మ.. పరకాల క్రాస్ రోడ్ వద్ద హోటల్ నిర్వహిస్తున్న ఆమె వద్దకు బైక్ పై హెల్మెట్ ధరించి ఇద్దరు వ్యక్తులు వచ్చి మెడలో నుంచి పుస్తెలతాడు తెంపుకొని (చోరీ చేసి) బైక్ పై హన్మకొండ వైపు పారిపోయారు. ఈ సంఘటనతో ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చారు కానీ అప్పటికే వారు కనిపించకుండా వాహనంపై పారిపోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరాల ఆధారంగా విచారణ జరుపుతున్నారు.





