Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :
హుజురాబాద్ పట్టణంలోని ప్రముఖ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ కమిటీ నూతన చైర్మన్గా బుర్ర ఆగయ్య, కోశాధికారిగా కాసర్ల శ్రీహరి బాధ్యతలు స్వీకరించారు.
నేడు దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో, పూర్వ చైర్మన్ క్యాస చక్రధర్, పూర్వ కోశాధికారి బూసరపు బాబురావుల నుంచి నూతన ధర్మకర్తల మండలి అధికారికంగా పదవీ బాధ్యతలను స్వీకరించింది.

ఆలయాభివృద్ధే ధ్యేయం:
బాధ్యతల స్వీకరణ అనంతరం నూతన చైర్మన్ బుర్ర ఆగయ్య, కోశాధికారి కాసర్ల శ్రీహరి మాట్లాడుతూ… శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆశీస్సులతో దేవాలయ సమగ్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఆలయ సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, పట్టణ ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని నూతన కార్యవర్గానికి శాలువాలు, పూలమాలలతో ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ పంజాల మనోజ్ (బంటి) గారు, 21వ వార్డ్ కౌన్సిలర్, బిజెపి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ హుజురాబాద్ పురపాలక సంఘం.





