Oplus_16908288
—అన్ని వర్గాల పేదలకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో సమన్యాయం కల్పించాలి.!!
—ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల అమలు ఉద్యమానికి
ఓసీ జేఏసీ, బహుజన కుల సంఘాల సంపూర్ణ మద్దతు…
—అన్ని సామాజిక వర్గాల ఆర్థిక స్థితిగతులపై సమగ్ర అధ్యయనానికి చట్టబద్ధ కమిషన్ ఏర్పాటు చేయాలి.
— ఓసీ జేఏసీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు పోలాడి రామారావు, రాష్ట్ర కో ఆర్డినేటర్ గోపు జైపాల్ రెడ్డి,ఆర్య వైశ్య మహా సభ రాష్ట్ర అధ్యక్షులు అమర వాది లక్మినారాయణ, ప్రధాన కార్యదర్శి దుబ్బా శ్రీనివాస్..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కుల మతాలకతీతంగా ఆర్ధిక ప్రాతిపదిక అన్ని వర్గాల పేదలకు విద్యా, ఉద్యోగ,ఉపాధి రంగాల్లో సమన్యాయం కల్పించడమే ద్యేయంగా ఉద్యమం చేపడుతున్నామని, ఓసీ ఐకాస, ఆర్ధిక ఆధారిత రిజర్వేషన్ల సాధన ఉద్యమ కమిటీ నాయకులు తెలిపారు.
కుల, మత ప్రాతిపదికన అమలవుతున్న ప్రస్తుత రిజర్వేషన్ విధానానికి ప్రత్యామ్నాయంగా అన్ని సామాజిక వర్గాల్లోని ఆర్థికంగా వెనుకబడిన పేదలకు ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించి సమన్యాయం జరపాలని ఇందుకు కేంద్రం ప్రత్యేక చట్టం తేవాలని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ఆర్ధిక ఆధారిత రిజర్వేషన్ల సాధన రాష్ట్ర కో ఆర్డినేటర్ గోపు జైపాల్ రెడ్డి, ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మినారాయణ, ప్రధాన కార్యదర్శి దుబ్బా శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఓసీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బా శ్రీనివాస్ అధ్యక్షతన మంగళవారం వరంగల్ పట్టణ పోచం మైదానం కమ్యూనిటీ హాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఓసీ ఐకాస ప్రతినిధులు, కుల సంఘాల నాయకులతో ఆర్ధిక ఆధారిత రిజర్వేషన్ల సాధన ఉద్యమ ఉదృతి పై నిర్వహించిన సన్నాహాక సమావేశంలో వారు మాట్లాడారు.
ఏ సామాజిక వర్గానికీ, మతానికీ తాము వ్యతిరేకం కాదని, కుల–మతాలకు అతీతంగా అన్ని వర్గాల్లోని పేదలకు సమాన అవకాశాలు లభించాలన్నదే తమ ఉద్దేశమని వారు స్పష్టం చేశారు.
ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల సాధన కోసం సామాజిక ఉద్యమకారుడు ప్రవీణ్ ఆరోరా ఆధ్వర్యంలో ఢిల్లీలోని రాజ్‌ఘాట్ నుంచి చేపట్టిన దేశవ్యాప్త రథ యాత్ర కు ఓసీ జేఏసీ, బహుజన కుల సంఘాలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ లో ఈనెల 24 న ఆదిలాబాద్ లో ప్రవేశించి 26 న జనగామ మీదుగా హన్మకొండ లో ఆధాలత్ అమరవీరుల స్తూపం కు చేరుకొని నివాళులు అర్పించిన అనంతరం పరకాల కు సాయంత్రం 4 గంటలకు చేరుకుంటుందని ఈ సందర్బంగా పరకాల లో ఓసీ జేఏసీ, బహుజన కుల సంఘాల ఆధ్వర్యంలో 26 న సాయంత్రం 5గంటలకు పార్టీల కతీతంగా వేలాది మంది తో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు
వెల్లడించారు.
ప్రస్తుత రిజర్వేషన్ విధానంలో క్రిమిలేయర్ నిబంధనల అమలు లేకపోవడం తో రిజర్వేషన్ల ప్రయోజనాలు ఇప్పటికే పొందిన కుటుంబాలకే ప్రయోజనాలు పునరావృతమవుతున్నాయనే వాదనల నేపథ్యంలో, అర్హులైన ఇతర పేదలకు న్యాయం జరగాలన్నారు.
ఈ నేపథ్యంలో ఓసీ వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించిన తరహాలోనే, అన్ని సామాజిక వర్గాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వారికి సమాన అవకాశాలు కల్పించే విధంగా ఆర్థిక స్థితిగతుల ఆధారిత రిజర్వేషన్ విధానాన్ని రూపొందించాలని వారు కోరారు.
ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధ కమిషన్ ఏర్పాటు చేసి అన్ని సామాజిక వర్గాల ఆర్థిక స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేయాలని సూచించారు. అవసరమైతే రాజ్యాంగ సవరణపై పార్లమెంట్లో చర్చించి శాశ్వత పరిష్కారం చూపాలని పోలాడి రామారావు, అమరవాది లక్ష్మి నారాయణ,గోపు జైపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆర్ధిక ఆధారిత రిజర్వేషన్ల ఉద్యమ రథ యాత్రగోడ ప్రతులను నాయకులుఆవిష్కరించారు.
ఈ సమావేషంలో ఓసీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బా శ్రీనివాస్, రాష్ట్ర బ్రాహ్మణ సంఘాల జేఏసీ కన్వీనర్ పెండ్యమ్ రాఘవరావు, ఉమ్మడి జిల్లా కుమ్మరి సంఘం అధ్యక్షులు ఆవునూరి రామన్న, నాయకులు సుద్దాల రమేష్, వంగేటి అశోక్ తదితరులు పాల్గొన్నారు.





