
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ నుండి కరీంనగర్ ప్రయాణించే ప్రయాణికుల పై పెంచిన బస్ చార్జీలు తగ్గించాలని సిపిఎం పార్టీ హుజరాబాద్ మండల కార్యదర్శి కొప్పుల శంకర్ డిమాండ్ చేశారు.

శనివారం ఆయన మాట్లాడుతూ…. ప్రజలకు ప్రయాణ సౌకర్యాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని, అలాంటిది సామాన్య ప్రజలకు సొంత వాహనాలు లేకుంటేనే ప్రజా రవాణా వ్యవస్థ పై ఆధారపడి ప్రయాణిస్తారని అన్నారు. ఒకపక్క విపరీతమైన నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోయి ఇప్పటికే ప్రజలపై అనేక భారాలు పడుతున్నాయని అన్నారు. నేషనల్ హైవే పైన కొత్తగట్టు వద్ద ఏర్పటు చేసిన టోల్ గేట్ టోల్ టాక్సీ కీ సంబంధించిన భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని అట్టి భారాన్ని ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికులపై వేయొద్దని, వెంటనే పెంచిన చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కదిరి రమేష్, వెంకట చంద్రయ్య, రాచపల్లి శంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.
@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ మరియు సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ వర్దినేని రవీందర్ రావు గారు, 12వ వార్డు కౌన్సిలర్, హుజురాబాద్ పురపాలక సంఘం. మరియు సామాజిక కార్యకర్త.





