
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హిందువులు పవిత్రంగా జరుపుకునే దసరా పండుగ వేడుకలను మంగళవారం హుజురాబాద్ పట్టణంలో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పండగ సందర్భంగా మున్సిపల్ ఆధ్వర్యంలో జరిగిన దసరా వేడుకల్లో భాగంగా రామాలయం నుండి దేవతామూర్తుల విగ్రహాలను ఊరేగింపుగా రామ్ లీలా కార్యక్రమం జరిగే మైదానం వద్దకు తీసుకొని వచ్చారు. దేవతామూర్తుల ఊరేగింపులో మున్సిపల్ చైర్ పర్సన్ రొoటాల సుహాసిని, కమిషనర్ బి కిషన్, కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు పాల్గొని నృత్యాలు చేశారు. రామ్ లీలా మైదానంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఆయన సతీమణి శాలిని రెడ్డి, కుమార్తె శ్రీనికా రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, ఆమె భర్త మనోజ్ రావు ప్రజాప్రతినిధులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ…. దసరా పండుగ ప్రజలందరికి సుఖ సంతోషాలు సౌభాగ్యాలు కలగాలని దేవుని వేడుకున్నట్లు అన్నారు. అనంతరం మైదానంలో కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు, కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది.




అనంతరం రావణాసుర వధ కార్యక్రమం కనుల పండుగ జరిగింది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం హుజురాబాద్ ఏసిపి మాధవి, సిఐ కరుణాకర్ ఎస్ఐ రవి పలువురు పోలీసులు కృషి చేశారు.

&&లోకల్ యాడ్స్ &&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ మరియు మిత్రులు శ్రేయోభిలాషులకు విజయదశమి (దసరా) శుభాకాంక్షలు.








