
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, అక్టోబర్ 24: హుజూరాబాద్ పోలీస్ స్టేషన్‌ను శనివారం రోజున పోలీస్ కమిషనర్ శ్రీ గౌష్ ఆలం వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్‌కు హుజూరాబాద్ ఏసీపీ మాధవి, ఇన్స్పెక్టర్ కరుణాకర్ సాదర స్వాగతం పలికి, పూలమొక్కను అందజేశారు. అనంతరం సాయుధ బలగాల గౌరవ వందనాన్ని సీపీ స్వీకరించారు.
వార్షిక తనిఖీలలో భాగంగా స్టేషన్‌లోని పలు విభాగాలు, కీలక రికార్డులు, వర్టికల్స్ నిర్వహణను కమిషనర్ సమగ్రంగా పరిశీలించారు. సిబ్బంది విధి నిర్వహణ, క్షేత్రస్థాయి పనితీరును అడిగి తెలుసుకున్న ఆయన, శాంతిభద్రతల పరిరక్షణలో పారదర్శకత, వేగం పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.




ఫ్రెండ్లీ పోలీసింగ్: పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం అందిస్తూ, ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
సిసి కెమెరాల నిఘా: నేరాల నియంత్రణలో సీసీ టీవీల పాత్ర కీలకమని, పరిధిలోని నిఘా కెమెరాలన్నీ నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని ఆదేశించారు.
పరిశుభ్రత & ప్రాపర్టీ భద్రత: స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, కేస్ ప్రాపర్టీల భద్రత, రికార్డుల క్రమబద్ధీకరణపై శ్రద్ధ వహించాలని తెలిపారు. ఉపయోగంలో లేని పాత సామాగ్రిని కమిషనరేట్‌కు తరలించి ప్రాంగణాన్ని ఆహ్లాదకరంగా ఉంచాలని సూచించారు.
సిబ్బంది సద్ధసిద్ధత: పెట్రోలింగ్ వాహనాలు, ఆధునిక పరికరాలను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ ఏసీపీ వి మాధవి, ఇన్స్పెక్టర్ టి కరుణాకర్, ఎస్సైలు శ్రీనివాసరావు, రవి, మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.





