Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ టూ వీలర్ అండ్ ఆటో కన్సల్టెంట్ ఆధ్వర్యంలో ఖమ్మంలో భారీ వర్షంల వల్ల టూ వీలర్ మెకానిక్ వారి ఇండ్లు మరియు మెకానిక్ షాప్ లు వరుదలో మునిగి పోయాయి. వారి ఇండ్లు మరియు షాపుల పై స్పందించి వారి కుటుంబాలతో మాట్లాడి వారికి హుజురాబాద్ మెకానిక్ అసోసియేషన్ ద్వారా ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ కొండల్ రావుకి రూ .44వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ టూ వీలర్ అండ్ ఆటో కన్సల్టెంట్ అధ్యక్షులు గజ్జి సమ్మయ్య, ఉపాధ్యక్షులు పెద్దిముపేట దామోదరచారి, ప్రధాన కార్యదర్శి ఆడెపు బాలకృష్ణ, సహాయ కార్యదర్శిలు జూపాక శ్రీనివాస్, తలకొక్కుల రమేష్, కార్యవర్గ సభ్యులు వేముల మహేష్, రావుల బిక్షపతి, వాసల వెంకటేష్, నాగుల వెంకటేష్, గాజుల సదానందం, బసిరి సాంబయ్య, కొండ్రోజు శ్రీనివాస్, దుస్సా మల్లేశం, గాలి వెంకటస్వామి, బింగి రవికుమార్ పాల్గొన్నారు.






