మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సోమవారం తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గేజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మ ద్ ముజాహిద్ హుస్సేన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేది 17.2. 22 నుండి పెండింగ్ లో ఉన్న అన్ని నాలుగు డిఎ అలవెన్స్ జీవో ద్వారా వెంటనే ప్రకటించాలని పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులను క్లియరెన్స్ చేసి 2022 నుండి చేయాలన్నారు. అలాగే కుబేర వ్యవస్థను వెంటనే రద్దు చేస్తూ ట్రెజరీ డిపార్ట్మెంట్ ద్వారా బిల్లులను క్లియరెన్స్ చేసే పాత విధానాన్ని పునరుద్ధరించాలని అన్నారు. అన్ని ఉద్యోగుల సంఘాలతో సంప్రదింపులు చర్చలు ఇప్పటికే పూర్తి అయిన దృష్ట్యా ధరల పెరుగుదల ప్రకారం 51శాతం ఫిట్ మెట్ తో రెండో పి ఆర్ సి పార్సలను పిఆర్సి రిపోర్టును తెప్పించుకుని అమలుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, లబ్ధిదారులు ఉద్యోగులు మరియు పెన్షనర్లు సమాన సహకారంతో ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ ఎస్ వెంటనే అమలు చేయాలన్నారు. కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేయాలని, భవిష్యత్తు రిక్రూట్మెంట్లో కాంట్రాక్టు వ్యవస్థను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంత కుమారిలకు విజ్ఞప్తి చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు, సిపిఎస్ అండ్ యుపిఎస్ పాత పెన్షన్ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని, జీవో ఎంఎస్ 317 నీ సమీక్షించాలని, 317 జీవో బాధితుల బదిలీల కోసం కోరుకునే ఖాళీల లభ్యత కోసం అడగకుండా వీలైనంత త్వరగా వైబ్ సైట్ ద్వారా లేవనెత్తిన అన్ని ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోవాలన్నారు. రాష్ట్ర జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఆఫీసర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని, అభ్యర్థన ఉద్యోగులు మరియు పెన్షనర్లు మను వేదాలను పరిష్కరించడానికి కృషి చేయాలని, ప్రధాన ఉద్యోగుల సంఘాలు గుర్తింపు పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలు లేదా మెడికల్ ఇన్ వాలిడేషన్ క్లియరెన్స్ కోసం రాష్ట్రస్థాయిలో మెడికల్ ఇన్ వాలిడేషన్ ఉద్యోగుల కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. పిఆర్ సి 2020 బిల్లులకు సంబంధించిన క్లియరెన్స్ లను ఆర్థిక శాఖకు బదులుగా ట్రెజరీ పిఏఓ డిపార్ట్మెంట్ ద్వారా అడ్మిట్ చేయడానికి అనుమతి ఉద్యోగులు మరియు పింఛన్దారులకు పిఆర్సి 2020 కు ముందు బిల్లులను అనుమతించే ఆలస్యాన్ని నివారించడానికి కృషి చేయాలన్నారు. దాని సమయాన్ని 31-32023 నుండి 31- 3-2026 వరకు వ్యవధిని పొడిగించాలని, పదవి విరమణ అనంతరం సర్వీస్ పొడిగింపుగాని రీ ఎంప్లాయిమెంట్ ను కాని చేయవద్దు అన్నారు. తద్వారా సర్వీస్ లో ఉన్న జూనియర్ ఎంప్లాయిస్ ల యొక్క ప్రమోషన్ ప్రయోజనాలు కాపాడటం గ్రేట్ వన్ టూ త్రీ అండ్ ఫోర్ క్రింద గ్రామపంచాయతీల పునర్ వ్యవస్థకరణ మరియు ఉద్యోగులు క్యాడర్ కేటాయింపు అండ్ నియామకపు తేదీ నుండి సర్వీస్ లెక్కిస్తూ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరిజేషన్ కాలాన్ని నాలుగు సంవత్సరాల నుండి రెండు సంవత్సరాలకు తగ్గించటం మరియు ప్రమోషన్లు కల్పించటం చాలామంది ఉద్యోగులు ప్రమోషన్ లేకుండా పదవి విరమణ చేస్తున్నందున పరిపాలనకు అసౌకర్యాన్ని నీవరించడానికి మరియు ఉద్యోగులకు నష్టాన్ని నీవారించటానికి కృషి చేయాలని అన్నారు. ప్యానల్ సంవత్సరం మొదటి సెప్టెంబర్ నెలలో అన్ని విభాగాలలో డిపిసిలను నిర్వహించటం ద్వారా అర్హులైన ఉద్యోగులందరికీ ప్రమోషన్లు కల్పించటం హెచ్ ఓ డి నుండి సెక్రటేరియట్ కు బదిలీలపై నియామకాల కోసం 12 ఫైవ్ పర్సెంట్ కోటా అమలు చేయడం ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న తెలంగాణ క్లాస్ ఫోర్త్ ఉద్యోగులను మిగిలిపోయిన సుమారు 50 మంది సభ్యులను తొమ్మిదవ పదవ షెడ్యూల్సు నందు పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు తిరిగి తీసుకురావటం చేయాలన్నారు. జిల్లా ప్రజాపరిషత్ ల వ్యాధి గ్రస్త ఉద్యోగులపై ఆధారపడిన పిల్లల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 2.5 లక్షల మంది పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక పెన్షనర్స్ డైరెక్టేట్ ను వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర క్యాబినెట్ మంత్రులకు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతకుమారిలకు విజ్ఞప్తి చేస్తూ ఎసిబి మరియు విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ కేసులు మరియు డిపార్ట్మెంటల్ డిసిప్నే మరి కేసుల కింద బుక్కు చేయబడిన ఉద్యోగుల ఫైల్స్ ను వేదమంతమైన క్లియరెన్స్ చేసి ఉద్యోగుల కేసుల కోసం సమీక్ష కమిటీని వెంటనే నియమించాలన్నారు. నిర్దిష్ట విచారణ పూర్తయిన తర్వాత ఇంకోరి వేగమంతా చేయటం ద్వారా ఉద్యోగులను విధులలోనికి తీసుకోవాలని, ప్రభుత్వ శాఖలో పనిచేస్తూ మరణించిన వీఆర్ఏ కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలన్నారు. విఆర్ఓ అండ్ వి ఆర్ఎ లను వారి ఎంపికల ప్రకారం రెవెన్యూ శాఖకు తిరిగి తీసుకురావటం మరియు వారి మునుపటి సీనియార్టీ ప్రకారం వారి సేవలను రెవెన్యూ శాఖలో క్రమబద్ధీకరించడం, రాష్ట్రంలోని గ్రంథాలయ సంస్థ మార్కెటింగ్ కమిటీ సమస్త యు డే డే సంస్థలో పనిచేసే వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు మెడల్ స్కూల్స్ మరియు రెసిడెన్సి స్కూల్స్ ఉద్యోగులకు 010 హెడ్ ఆఫ్ అకౌంటు ద్వారా జీతభత్యాలు చెల్లించాలన్నారు. భూపాల్పల్లి, కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులకు బ్యాట్ కాంబ్లేట్ అలవెన్స్ మరియు అదనపు హెచ్ఆర్ఏను మంజూరు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ నుండి సీనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ నుండి ఏసిటిఓ ప్రమోషన్లు వెంటనే కల్పించాలని, ఇదే శాఖలో గజిటెడ్ స్థాయిలో ఉన్న అధికారులు అందరికీ ప్రతి ఒక్కరికి ప్రమోషన్లు కల్పించి కిందిస్థాయి జూనియర్ అసిస్టెంట్ నుండి సీనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ నుండి ఏ సి టి ఓ ప్రమోషన్ కల్పించకుండా పెండింగ్ పెట్టిన ఫైల్ ను వెంటనే కదిలించి వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ సీనియార్టీ ప్రకారం రోస్టర్ ప్రకారం వెంటనే ప్రమోషన్లు కల్పించాలన్నారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఏసీటీవోలు రాత్రి పగలు లారీలు తనకీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రెవెన్యూ ఇస్తున్నారు కనుక లారీలు తనకీలు చేస్తే ఏసిటిఓ లకు వాహనాలను కూడా తెలంగాణ ప్రభుత్వం వెంటనే కల్పించాలని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర క్యాబినెట్ మంత్రులకు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంత కుమారి, రాష్ట్ర ప్రభుత్వ రెవిన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ రజ్విలకు తెలంగాణ టీసీ టీఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.
- Home
- ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించండి! -తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్.. సీఎం రేవంత్ రెడ్డి, సిఎస్ శాంత కుమారిలకు విజ్ఞప్తి