
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు, కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి (కాకా) 95వ జయంతి సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వోడితల ప్రణవ్ ఆదేశాల మేరకు హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మండల మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళా విభాగం నాయకురాల్లు మహానాయకుడికి నివాళులు అర్పించారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారుడిగా, సింగరేణి బాంధవుడిగా, కార్మిక పక్షపాతిగా వెంకటస్వామీ ఎనలేని సేవలు అందించారని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సొల్లు బాబు హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేకల తిరుపతి, కొలిపాక శంకర్, ఏర్ర రవీందర్, సందమల్ల బాబు, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు యండి అఫ్సర్, హుజురాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు సందమల్ల నరేశ్, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి మిడిదొడ్డి రాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు జంగ అనిల్ ,యండి ఇమ్రాన్, ప్రతాప నాగరాజు పటేల్, గంట కిరణ్ రెడ్డి, సొల్లు సునిత, నర్సింగ్ ,ముక్క రవితేజ, యండి రియాజ్, గొస్కుల మధు, రాజు కుమార్, ఇల్లందుల సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.







