Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
స్థానిక హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం బతుకమ్మ సంబరాలను ప్రిన్సిపాల్ వి అంజనేయరావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఉదయం నుండి కళాశాల, మహిళా ఉద్యోగులు, విద్యార్థిని విద్యార్థులు ఒకచోట చేరి వివిధరకాల పూలతో, గౌరమ్మసహిత బతుకమ్మను పేర్చి, ఒకదగ్గర చేర్చి ఆటపాటలు, కొలాటాలతో ఆడి పాడారు. ఈ సందర్భముగా ప్రిన్సిపాల్ ఆంజనేయరావు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రకృతిని ఆరాదిస్తూ, సుఖ సంతోషాలతో కలిసి మెలిసి ఉండాలి అని తెలిపారు. ఈ పండుగ వాతావరణంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.






