Oplus_0
స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్: ఈ నెల 4వ తేదీన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రములో రాష్ట్ర, కేంద్ర పోలీస్ లు 32 మందికి పైగా మావోయిస్టు పార్టీ వారిని కాల్చి చంపడాన్ని సి.పి.ఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కమిటీ ఖండిస్తున్నదని, నారాయణ పూర్ దంతెవాడ సరిహద్దు నేందురు తులతులి అడవుల్లో మావోయిస్టులు సమావేశం అయినట్లు సమాచారంతో కుంబింగ్ చేసి ఎన్కౌంటర్ తో కాల్చేశారని, ఇది దుర్మార్గపు చర్య అని సి.పి.ఐ (ఎంఎల్ )మాస్ లైన్ ప్రజా పంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ శనివారం పేర్కొన్నారు. హోం మంత్రి అమిత్ షా ప్రకటించినట్లు కగార్ ఆపరేషన్ ఎన్కౌంటర్ గా స్వస్టమౌతున్నదని, ఈ మధ్యకాలంలో 180కి పైగా మృతువాత పడ్డారన్నారు. చట్ట ప్రకారంగా అరెస్టుచేయడానికి బదులు విచారణ ద్వారా శిక్షించడానికి బదులు చంపి వేయడం చట్ట వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేక చర్యగా భావిస్తున్నామన్నారు.
ఈ విధానాన్ని మానుకోవాలని ప్రభుత్వానికి స్పష్టం చేస్తున్నామన్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు చట్ట ప్రకారం శిక్షించాలి తప్ప ఇలా రాజ్యంగమును మూకుమ్మడి హత్యాకాండకు పూనుకోవడం దుర్మార్గపు చర్యగా కాదని స్పష్టం చేస్తున్నామన్నారు.






