Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ఇచ్చిన హామీల అమలులో పాలకుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ, డిమాండ్ల సాధనకు నిర్వహించే రైతుల సమరభేరికి సర్వం సిద్ధం చేసి, ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు పోలాడి రామారావు, గోపు జైపాల్ రెడ్డిలు వెల్లడించారు.
ఇచ్చిన హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఈ సభ ద్వారా ఎండ గడుతామని వివరించారు. శనివారం హైదరాబాద్ లో నిర్వహించిన రాష్ట్ర, జిల్లాల ఐకాస ప్రతినిధులతో ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమీక్షించి సభా నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్బంగా రామారావు మాట్లాడుతూ జూన్ 14 న సాయంత్రం 5 గంటలకు కరీంనగర్ ఎస్ఆర్ ఆర్ కాలేజీ గ్రౌండ్ లో లక్షలాది మందితో నిర్వహించే రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జన సమరభేరికి రెండు వేల అయిదు వందల బస్సుల్లో, వివిధ వాహనాల్లో వివిధ మార్గాల్లో అన్ని జిల్లాల నుంచి తరలి రావడానికి రైతులు స్వచ్చందంగా ఏర్పాట్లు చేసుకున్నారన్నారు.
5 వేల మంది మహిళల కోలాటాల బృందం, రెండు వేల డప్పు కళాకారులు ర్యాలీ గా సభకు తరలి వస్తున్నట్లు చెప్పారు. రూప్ టాప్ సభాస్థలి వేదిక, లౌడ్ స్పీకర్లు, 20 వేల కుర్చీలు, 20 ఎకరాల చుట్టూ ఇరువైపులా భారీ కేడ్లు, సభా స్థలి మధ్యలో ఎల్ ఈడి తెరలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సభకు వచ్చే రైతులకు లక్ష మజ్జిగ పాకెట్లు, 80 వేల పులిహోర పొట్లాలు, లక్ష మినరల్ వాటర్ బాటిళ్లను ధాతలు సమకూర్చినట్లు తెలిపారు. వేదికకు ఎడమ ప్రక్కన తెలంగాణ ఉద్యమ గాయకుడు సందీప్ ఆధ్వర్యంలో 100 మంది బృందంతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. సభా వేదిక నుంచి నలువైపులా 20 km వరకు ఆర్చిలతో సహా ప్రధాన కూడళ్లలో తోరణాలతో అలంకరణ, వీక్షకులకు ఎల్.ఈడి తెరల సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. వివిధ జిల్లాలు ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల నుంచి వచ్చే వారి కి కిట్స్ సింగాపూర్ లో, కామారెడ్డి, సిరిసిల్ల రూట్ లోవచ్చే వారికి కొదురుపాక వద్ద, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ నుంచి వచ్చే వారికీ ధర్మారంలో, నిజామాబాద్,జగిత్యాల రూట్ లో వచ్చే వారికీ గంగాధర క్రాస్ లో. మంచిర్యాల, గోదావరిఖని, పెద్దపల్లి రూట్లో వచ్చే వారికీ సుల్తానాబాద్ లో మహబూబ్ నగర్, మేడ్చల్, సిద్దిపేట రూట్లో వచ్చే వారికీ శనిగరంలో, హుస్నాబాద్ రూట్ లో వచ్చే వారికీ ఎల్కతుర్తిలో భోజన వసతి, మజ్జిగ, మంచినీటి సౌకర్యం విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమావేశ ప్రాంగణంలో 800 మంది వాలంటీర్లతో బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సభా స్థలి ప్రాంగణం క్రిక్కిరిసే అవకాశం మున్నందున నగరంలోని ఆరు ప్రధాన కూడల్లలో దాతల సహకారం తో బిగ్ ఎల్ ఈడి తెరలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సభకు అంచనాలకు మించి రెండు లక్షలకు పైగా ప్రజలు సమరభేరికి హాజరు కానున్నట్లు తెలిపారు. రేవంత్ సర్కార్ అధికార పగ్గాలు చేపట్టి రెండున్నరేండ్లు దాతుతున్నా రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు వివిధవర్గాలకు ఇచ్చిన హామీల అమలులో ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు.
రైతులకు అన్ని పంటలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని ఇవ్వక మాట తప్పారన్నారు. రైతు కూలీలకు 12 వేల రూ. కౌలు రైతులకు 15 వేలు ఇస్తామన్న డబ్బుల ఊసే లేదని, రుణమాఫీ అర కొరగా చేసి వది లేశారన్నారు. ఇప్పటికే రెండు విడతల భరోసా నిధులను ఎగ్గొట్టిన సర్కార్ యాసంగి సీజన్ ముగిసినా కేవలం కంటి తుడుపుగా రెండు ఎకరాలవరకే దాదాపు 5 వేల కోట్ల భరోసా డబ్బులు ఇచ్చి మిగతా 4 వేల కోట్ల భరోసా నిధుల విడుదల చేయక చేతులెట్టిసిందన్నారు. నేటి ఖరీఫ్ సీజన్ మొదలై రైతులు ముమ్మరంగా సాగు పనులు చేస్తున్న ఈ తరుణంలో ఖరీఫ్ కు రైతు భరోసా నిధుల విడుదలలో ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయక పోవడం వల్ల అన్న దాతల్లో ఆందోళన మొదలైనదన్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి ప్రైవేట్ దళారులతో కుమ్మక్కై కొనుగోలు కేంద్రాల్లోని దాన్యం కొనుగోళ్లలో 40 రోజులు ఆలస్యం చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. తరుగు రవాణా పేరుతో 1200 కోట్ల రూపాయలను రైతులు నిలువు దోపిడీకి గురై తీవ్రంగా నష్టపోయారన్నారు. దీనికి పూర్తి బాధ్యత పౌర సరఫరాల శాఖ వహించాలన్నారు. ఎరువుల పంపిణీ లో యాప్ పేరుతో రైతులను దగా చేస్తున్నారన్నారు. డిస్కీమ్ ల పేరుతో విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయదానికి రంగం సిద్ధం చేస్తోందన్నారు. రెవెన్యూ రంగంలో జవాబు దారి తనం లేక సామాన్యులు ఇక్కట్ల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల వ్యవసాయ సహకార రంగంలో నామినెటెడ్ పద్ధతి దారుణం అన్నారు. రైతుల నీటి వినియోగదారుల వ్యవస్థను మూలన పడేశారన్నారు. విద్యార్థులకు ఫీజ్ రియం బర్స్మెంట్ చెల్లింపులు చేయడం లేదన్నారు. నిరుద్యోగుల హామీల అమలు పై కనీస దృష్టి సారించడం లేదన్నారు. డిమాండ్ల సాధనకు కరీంనగర్ లో రాజకీయాల కతీతంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి రైతు మహాగర్జన సమర భేరి సభ ద్వారా హామీల అమలులో ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టి ప్రశ్నిస్తామని, డిమాండ్లను ముందుంచి ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యంపై సమర భేరి రణ గర్జన మోగించి కళ్ళు తెరిపిస్తామని పోలాడి రామారావు పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్వాహకులపైన, బస్సులు ఇచ్చిన యాజమాన్యాల పైన ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా వెనక్కి తగ్గేదే లేదని, ఇఛ్చిన హామీలను అమలు చేసే వరకు ఇప్పుడు నిస్తేజంగా నాం కే వాస్తేగా ఉన్న ప్రతి పక్షాల వలె కాకుండా తమ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రశ్నించే నిఖారసైన ప్రశ్నించే గొంతుకలాగా గొంతుకలాగా ప్రభుత్వాన్ని గుక్క తిప్పుకోకుండా తెలంగాణ ఉద్యమ తరహాలో ఉదృతంగా ఉద్యమిస్తామన్నారు. రైతుల సమర భేరి సభకు అన్ని పార్టీల నాయకులను ఆహ్వాణించామని ఈ సమావేశనికి వివిధ వర్గాల వారు రైతులు పార్టీల కతీతంగా పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావుతో పాటు ఆహ్వాన కమిటీ నాయకులు పిలుపునిచ్చారు.





