
–హుజురాబాద్ గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డా… వొడితల ప్రణవ్..
–హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ప్రణవ్..
–ప్రభుత్వం అధికారంలో ఉండి ఎమ్మెల్సీ, విప్ గా ఉన్నప్పుడే కౌశిక్ రెడ్డి ఏం చేయలే.
–ఉప ఎన్నికల్లో ఇచ్చిన ప్రొసీడింగ్స్ కు అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించలేదు.
–అభివృద్ధి ఓర్వలేక కాంగ్రెస్ పై నిందలు.
–సర్ పై హుజూరాబాద్ లో బీఎల్ఏ లకు ప్రత్యేక అవగాహన సదస్సు..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బై ఎలక్షన్ తర్వాత హుజురాబాద్ అభివృద్ధికి ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం రూపాయి కూడా కేటాయించలేదని, ఇక్కడున్న కౌశిక్ రెడ్డి పిచ్చి లేసినట్టు ప్రవర్తిస్తునాడే తప్ప అభివృద్ధి గురించి ఏనాడు మాట్లాడలేదని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. శనివారం హుజురాబాద్ పట్టణంలోనీ ప్రతాపసాయిరెడ్డి గార్డెన్ లో సర్ పై బిఎల్ఏ లకు అవగాహన సదస్సు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అధ్యక్షతన ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం, సుడా చైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ సర్ పై జాగ్రత్తగా ఉండాలని, ఓటరు నమోదు జాబితా తొలగించే, జతచేర్చే క్రమంలో అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. హుజురాబాద్ ఇకపై కాంగ్రెస్ అడ్డా అని దానికి ఉదాహరణ హుజురాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగిరిందని, సర్పంచుల స్థానంలో మొదటి స్థానం, ఎంపీలో, ఎమ్మెల్సీ లో ముందు స్థానంలో ఉన్నామని ఇకపై హుజురాబాద్ లో ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని, వడ్ల, మక్కల కొనుగోలుపై అబద్ధాలు చెప్పారని జమ్మికుంట మార్కెట్ లో సుమారు లక్ష క్వింటాళ్ల పై చిలుకు మక్కలు కొనుగోలు చేశామని, చివరి గింజ వరకూ కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేశామని ఇది మా ప్రభుత్వ పనితీరు అని అన్నారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా ఏం పని చేశాడో, ఎన్ని నిధులు తీసుకొచ్చావో చెప్పే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. కనీసం ఉప ఎన్నికల్లో ఇచ్చిన పనులు, ప్రొసీడింగ్స్ కూడా పూర్తి చేయలేదని ఉప ఎన్నిక తర్వాత 2న్నర సంవత్సరాల్లో వారి ప్రభుత్వమే ఉంది అయిన వారు ఇక్కడ అభివృద్ధికి నిధులు మంజూరు చేపించలేదని, ఎమ్మెల్సీగా, విప్ గా, ఎమ్మేల్యేగా హుజురాబాద్ అభివృద్ధికి తట్టెడు మట్టి కౌశిక్ రెడ్డి తీయలేదని మండిపడ్డారు. బిఆర్ఎస్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులను ఆదుకున్నామని 10 సంవత్సరంలో చేసిన రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒకే సంవత్సరంలో చేశామని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీళ్లు మాయం, నిధులు మాయం, అప్పుల కుప్పగా చేశారని 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రైతు సంక్షేమం, అభివృద్ధి కాంక్షించినదని పేర్కొన్నారు. ఉనికి కాపాడుకోవడం కోసమే మాట్లాడుతున్నారు తప్ప ప్రజల్లో ప్రజాబలం బిఆర్ఎస్ కి లేదని అన్నారు. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తు చేశారు. రాజకీయాల కోసమే దళిత సోదరులను వాడుకున్నారని గత ప్రభుత్వం 2 ఏళ్లు అధికారంలో ఉన్నా ఎందుకు పూర్తి స్థాయిలో దళిత బంధు నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డినీ ప్రజలు తిరస్కరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, వైస్ చైర్ పర్సన్ అంజలి, కౌన్సిలర్లు, వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ లు, డైరెక్టర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, దేవాలయ చైర్మెన్ లు, అన్ని మండలాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మహిళా అధ్యకురాల్లు, జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మైనారిటీ నాయకులు, సేవాదళ్, బ్లాక్ కాంగ్రెస్, అనుబంధ సంఘాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా ఇంచార్జీలు, సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మాట్లాడుతున్న పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు..

కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం

బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హుజూరాబాద్ కు ఎందుకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వలేదు?
బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో హుజురాబాద్ కు ఎందుకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వలేదని ప్రశ్నించారు ప్రణవ్. కనీసం ఉప ఎన్నికల సమయంలో స్వయంగా హరీష్ రావు ఇచ్చిన ప్రొసీడింగ్స్ వెనక్కి మళ్ళాయనీ, ఆనాడు పదేళ్లు ఉండి చేయలేదు ఇప్పుడు గెలిపిస్తే చేస్తామని ప్రజలను మభ్యపెట్టే మాటలు మానుకోవాలని హరీష్ రావుకు సూచించారు. కౌశిక్ రెడ్డి మాయలో పడి హరీష్ రావు కూడా అబద్ధాలు మాట్లాడారని, హుజురాబాద్ ప్రజలు చైతన్యవంతులనీ అన్ని గమనిస్తున్నారని అన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు





