
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన కొండం రాజిరెడ్డి అనే రైతు ఎండలో పనిచేస్తూ వడదెబ్బతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

రాజిరెడ్డి గత రెండు రోజులుగా వ్యవసాయ పనులు చేస్తుండగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రతిభాపారిన పడి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వారు తెలిపారు. వెంటనే అతన్ని హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు మృతుని బార్య సునీత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. మృతునికి భార్య సునీతతో పాటు 8వ తరగతి చదివే కొడుకు సాత్విక్ రెడ్డి ఉన్నారు.

మృతి చెందిన కొండం రాజీరెడ్డి





