
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ శివారులోని మత్స్యకారులకు వరప్రదాయనిగా ఉన్న గుండ్ల చెరువు కు హద్దులు పాతి కబ్జాదారుల నుండి కాపాడాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి గురువారం మత్స్యకారులు రైతులు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ హుజురాబాద్ గుండ్ల చెరువు వల్ల మత్స్యకారులు చేపలు పెంచడమే కాకుండా, రైతులు తమ పంటలను పండించుకుంటున్నారని అన్నారు. కానీ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువు పరిసర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి చెరువును కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇంతేకాక తమ భూములను మంచి ధరకు విక్రయించుకోడానికి గాను అధికారులకు తప్పుడు సమాచారం అందిస్తున్నారని అన్నారు. ఇంతే కాకుండా మత్తడి రాళ్లను తీసి వేయించి వారి భూములకు ధర పలికే విధంగా చూస్తున్నారని అన్నారు. సుమారు 500 మంది మత్స్యకార కుటుంబాలు , అనేకమంది రైతులు గుండ్ల చెరువుపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. గుండ్ల చెరువు హద్దులు నిర్ణయించి చెరువు భూమి కబ్జా కాకుండా కాపాడాలని ఎమ్మెల్యేలను వేడుకున్నారు.

-అధికారులకు వినతి పత్రాలు
గుండ్ల చెరువు హద్దులు చూపాలని కోరుతూ మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో గురువారం హుజురాబాద్ ఆర్డీవో కార్యాలయంలో, తాసిల్దార్ నరేందర్, మున్సిపల్ కమిషనర్ కిషన్, ఇరిగేషన్ ఈ ఈ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య, ముదిరాజ్ సంఘo గౌరవ అధ్యక్షులు గుడ్డేల్గుల సమ్మయ్య, అధ్యక్షుడు గుడ్డేల్గుల పోచయ్య, మౌటం రవీందర్, పిల్లి సమ్మయ్య, ఎంపటి సదానందం, శంకర్ , గుడ్డేల్గుల రవి, సారయ్య, ఎంపటి సతీష్ కుమార్, బొగ్గుల రాజేశం, రైతులు పాల్గొన్నారు.





