
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : భూగర్భ జలాల పెంపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ డిఆర్డిఓ గీతా అన్నారు. సోమవారం హుజూరాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్లు, ఐహెచ్ హెచ్ ఎల్ మంజూరి, జలసిరి, వనమహోత్సవం, గ్రామ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు, వివో బిల్డింగులు, ఎస్.బి.ఎం కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఎలినో ప్రభావం వల్ల కాబోయే కాలంలో వర్షాలు పడక నీటికి ఇబ్బందులు వస్తాయన్నారు. వీటిని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ ఇండ్ల ముందు ఇంకుడు గుంతలు, చేల గుంట నీటి గుంటలను ఏర్పాటు చేయాలన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో హుజురాబాద్ ఎంపీడీవో తూర్పాటి సునీత, ఎమ్.పీ.ఓ ఎమ్.రాజేందర్, ఎ.పి.ఎమ్ ఎమ్.లత, ఎ.పి.ఓ జి.స్వామి, గ్రామ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.





