
,మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వాటర్ ప్యూరిఫైయర్ల ద్వారా స్వచ్ఛమైన నీరు అందుబాటులోకి వస్తుందని తద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుందని హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సోమవారం జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర సెకండరీ పాఠశాల లతోపాటు కాట్రపల్లి, పెద్దపాపయ్యపల్లి, కందుగుల, సిరసపల్లి, సింగపూర్, చెల్పూర్ గ్రామాల ప్రభుత్వ పాఠశాలలో వాటర్ ప్యూరిఫైయర్లు, రాజపల్లి గ్రామంలో ప్రజలకు మినరల్ వాటర్ ప్లాంటును ఎమ్మెల్యే ప్రారంభించారు.





ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….నేటి బాలలే రేపటి పౌరులని ఆరోగ్యవంతమైన పౌరులను తయారు చేయడం మన బాధ్యత అనే అన్నారు. స్వచ్ఛమైన నీరు పిల్లలకు అందించడం ద్వారా వారికి ఆరోగ్య రక్షణ కలుగుతుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం మనందరి బాధ్యత. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో ఉన్నత లక్ష్యాలను సాధించేలా అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను. విద్యార్థుల భవిష్యత్తులో పెట్టే ప్రతి అడుగు సమాజ అభివృద్ధికి బలమైన పునాది అవుతుంది” అని అన్నారు. చెల్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను దత్తత తీసుకుని దశలవారీగా అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తానని అన్నారు . విద్యార్థులకు నాణ్యమైన విద్యాభ్యాస వాతావరణం కల్పించేందుకు అవసరమైన తరగతి గదులు, తాగునీటి సౌకర్యం, పారిశుధ్యం, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి తనవంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.




—జయన్న ఫౌండేషన్ సేవలు అభినందనీయం
హుజురాబాద్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు అందించే ఉద్దేశంతో జయన్న ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయం అన్నారు.

అనంతరం జయన్న పౌండేషన్ చైర్మన్ గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలలో చదివే నిరుపేద విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి, వారిని విద్యలో మరింత ప్రోత్సహించేందుకు వాటర్ ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలలో 1285 మంది వృద్ధులకు ఉచితంగా కంటి పరీక్షలు చేయించి మందులను అందించినట్లు తెలిపారు. ప్రజల సౌకర్యార్థం త్వరలోనే ఫ్రీజర్లు కొనుగోలు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతానని అన్నారు. ఈ సందర్భంగా జయన్న ఫౌండేషన్ చైర్మన్ సరిత జైపాల్ రెడ్డిలను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, సర్పంచులు కట్కూరి మల్లారెడ్డి, పోల్సాని రామారావు, కత్తెరమల్ల రాజు, కౌన్సిలర్ గందె శ్రీనివాస్, ఎండి. ఖాళీదు హుస్సేన్, జనగామ రాజేశ్వరరావు, పూజారులు కృష్ణమూర్తి శర్మ, శంకరయ్య, నాయకులు ప్రతాప తిరుమల్ రెడ్డి, ముత్యంరాజు, ఐలయ్య, బిక్షపతి, శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.





