
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ఈటెల షాపింగ్ కాంప్లెక్స్‌లో హుజురాబాద్ కు చెందిన ఎర్ర అనిల్ కుమార్ నూతనంగా పవర్ టూల్స్ షాప్ ఏర్పాటు చేసుకోగా ప్రముఖ సామాజిక వేత్త, మానవతావాది మండలంలోని సిర్సపల్లికి చెందిన సబ్బని వెంకట్ కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. షాప్ దినదిన అభివృద్ధి చెంది ఆర్థికంగా బలపడాలని అనిల్ కుమార్ కు సూచించారు. అలాగే హుజురాబాద్ నియోజకవర్గం, కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ విజయదశమి, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులతో పాటు సబ్బని వెంకట్ అభిమానులు పలువురు పాల్గొన్నారు.


*పత్రికా ప్రకటనలు*






