మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ ( జమ్మికుంట,నవంబర్ 16) కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని చాణిక్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ అధ్యక్షతన మాదకద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించారు..కార్యక్రమంలో జమ్మికుంట ఎక్సైజ్ ఎస్సై సౌమ్య మాట్లాడుతూ…విద్యార్థులు మాదకద్రవ్యాలు వాడటం వల్ల పలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటానని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉన్నప్పుడే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదుగుతారని సూచించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ సౌమ్య, కళాశాల కరస్పాండెంట్ దబ్బేట విజయ-రవీందర్, డైరెక్టర్లు ప్రభాకర్, శ్రీనివాస్, విజేందర్ రెడ్డి, చిరంజీవి, శివ కళాశాల ప్రిన్సిపల్ వంశీకృష్ణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు సాయికృష్ణ, సతీష్ అగ్నిమాపక సిబ్బంది, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.