మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పుల్ల వంశస్థులు అన్ని రంగాల్లో రాణించాలని ఎఎస్పి పుల్ల శోభన్ కుమార్ అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో విగ్నేశ్వర గార్డెన్లో పుల్ల వంశాస్థుల ఆత్మీయ సమ్మేళనం కన్నుల పండువగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీ పసునూరి దయాకర్, ఏఎస్పీ రిటైర్డ్ సంజీవరావు, డాక్టర్ పుల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ పుల్ల వంశస్థులు ఆర్థిక రాజకీయ రంగాల్లో రాణించాలని ఉన్నత విద్యలో ముందుండాలని పిలుపునిచ్చారు. యువత ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాలని కోరారు. 43 గ్రామాల్లో ఉన్నటువంటి పుల్ల వంశస్థులు అందరూ ఎక్కడున్నా అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ఎక్కడున్నా ఐక్యతతో ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకొని రాణించాలని, ఇతరులకు ఆదర్శవంతంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పుల్ల శ్రావణ్ కుమార్, పుల్ల సాంబయ్య, పుల్ల కుమారస్వామి, పుల్ల రాధ, వెంకటస్వామి, పుల్ల యేసు, పుల్ల సుదర్శన్, పుల్ల సృజన్, పుల్ల అనిల్ కుమార్, పవన్ కుమార్, పుల్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
- Home
- ఉప్పల్ లో అలరించిన పుల్ల వంశస్థుల ఆత్మీయ సమ్మేళనం