
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అంతరించిపోతున్న ప్రాచీన , గ్రామీణ కళారూపాలను పరిరక్షించేందుకు మరియు జానపద, లలిత కళలను ప్రోత్సహించి అభివృద్ధి చేయుటకు వారికి శిక్షణ ఇచ్చి కళాకారులను, బృందాలను, కళా సంస్థలను తీర్చిదిద్దుటకు గ్రామీణ ప్రాంతాల్లో కళాబృందాలను స్థాపించుటకు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక కళాకారుల సమాఖ్య నూతనంగా మండల అధ్యక్షులను నియమించింది. వారికి హుజురాబాద్ కళాకారుల సంస్థ కార్యాలయంలో సీనియర్ డప్పు కళాకారుడు అందాసి నారాయణ వారికి నియామక పత్రాలను అందజేశారు. ఎల్కతుర్తి మండల సమాఖ్య మహిళ అధ్యక్షురాలుగా పల్లె భాగ్యశ్రీ, కార్యదర్శిగా కేంసారపు సంధ్య, భీమదేవరపల్లి మండల సమాఖ్య మహిళా అధ్యక్షురాలుగా కూన రేణుక, హుజురాబాద్ మండల సమాఖ్య అధ్యక్షురాలుగా మిడిదొడ్డి వసుంధర, సైదాపూర్ మండల అధ్యక్షురాలుగా కొండపర్తి స్వరూపలు నియామక పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా నూతన మహిళా అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు వైఎస్ శర్మ, ప్రధాన కార్యదర్శి వెంపటి నందినిలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్పి రాష్ట నాయకుడు మారేపల్లి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్, అడ్వకేట్ మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.
