
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హిందువుల ఆరాధ్య భగవంతుడైన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం వేడుకలను ఘనంగా నిర్వహించుకుందామని విశ్వ హిందూ పరిషత్ హుజురాబాద్ మండల అధ్యక్షుడు కంకణాల రమేష్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ మండలం కనుకులగిద్ద గ్రామంలో సోమవారం నాడు వివిధ గ్రామల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం పురస్కరించుకొని ప్రతి గ్రామంలోని రామోత్సవాలు జరపాలని ప్రతి ఇంటిపై కాషాయ ధ్వజం ఎగరవేయాలని లక్ష్యం పెట్టుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో విశ్వహిందూ పరిషత్ మండల కార్యదర్శి భాషాబోయిన చంద్రయ్య, మాందాడిపల్లి అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, జూపాక అధ్యక్షులు రావుల సురేష్, రాంపురం అధ్యక్షులు కిషన్, వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.






