
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో డంపు యార్డ్ ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ర్యాలీగా వచ్చి ఎమ్మార్వో కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు మాట్లాడుతూ డంప్ యార్డ్ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చెత్తను మొత్తం ఇక్కడ వేస్తే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురు అవుతాయని అన్నారు. డంపు యార్డ్ ఏర్పాటు వల్ల ఇక్కడి ప్రజలు అనారోగ్యం పాలవుతారని, అలాగే ఇక్కడ ఉన్న వ్యవసాయ భూములు కూడా పాడవుతాయని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం డంపు యార్డ్ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. డంపు యార్డ్ ప్రతిపాదన ఉపసంహరించకుంటే భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, పట్టణ మాజీ ఫ్లోర్ లీడర్ పైళ్ల వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు కోలుగురి సుమలత సుమన్, అనురాగ్ రోహిత్, లక్ష్మిదుర్గ, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, బిజెపి సీనియర్ నాయకులు నరాల రాజశేఖర్, తిప్పబత్తిని రాజు, యాంసాని శశిధర్, అంకతి వాసు, దామెర అనురాగ్, కందుగుల సర్పంచ్ ముప్పు మహేష్, బోరగాల సారయ్య, పవన్ కుమార్, కురిమిళ్ల శ్రీధర్, మోటపోతుల రాకేష్, ఎర్ర శ్రీధర్, కుథాడి కుమారస్వామి, ఇల్లందుల ప్రణీత్, కొలుగురి శిరీష, అనిల్, పడారి సుమన్, బొడిగే రాద, సుదర్శన్, గొట్టే రవీందర్, అయిత సందీప్, భీమాజు వెంకట్, బండి సాయికృష్ణ, రాజేష్ ఖన్నా, నీలం రవీందర్, కుసుమ సమ్మయ్య, తిప్పబత్తిని రాజేందర్, తూర్పాటి రాజశేఖర్, రామ్ చంద్రం, పురాణం శ్రీనివాస్, పర్థం విజయ్, సురేష్, అనిల్, సాగర్, వివిధ మోర్ఛ నాయకులు, శక్తి కేంద్ర ఇంచార్జులు, బూత్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న బిజెపి నాయకులు, కార్యకర్తలు..

తాసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేస్తున్న బిజెపి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు..





