
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండల నూతన విద్యాధికారిగా విడపు శ్రీనివాస్ ఎంఆర్సి భవనంలో శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం ఎంఈఓగా పనిచేసిన భూపతి శ్రీనివాస్ స్థానంలో ప్రభుత్వం సిర్సపల్లి గెజిటెడ్ హెచ్ఎం గా పనిచేస్తున్న విడపు శ్రీనివాసును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….మండలంలో విద్యాభివృద్ధి కోసం అందరినీ సమన్వయం చేస్తూ కృషి చేస్తానని చెప్పారు. విద్యార్థుల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. మండలంలో ఉత్తీర్ణత శాతం పెరగడానికి అందరి సహకారం తీసుకుంటానని ఆయన తెలిపారు. ఆయన పదవి బాధ్యతలు స్వీకరించడం పట్ల భూపతి శ్రీనివాస్, కేతిరి నరసింహారెడ్డి, కే శ్రీనివాస్ రెడ్డి, కట్టా రవీంద్రచారి, మండలంలోని ఉపాధ్యాయ సంఘం నాయకులు పి. ఆదర్శన్ రెడ్డి, టీ.మాధవరావు, భాగ్యరేఖ, ఈశ్వర్ రెడ్డి, రాజేందర్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శోభారాణి, కైరునిసా బేగం, ప్రదీప్, తిరుమల, అనురాధ, సంజీవరెడ్డి, చిరంజీవి, పరాంకుశం వెంకటేశ్వరస్వామి, పి ఆర్ శ్రీనివాస్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు కోరేము సంజీవరెడ్డి, నాయకులు పారెడ్డి రవీందర్ రెడ్డి, బద్దుల రాజ్ కుమార్, కామని రవీందర్, పి కిరణ్ కుమార్, మాడిశెట్టి ప్రసాద్, పిల్లల సతీష్, కోటేశ్యదవ్, తిరుపతి యాదవ్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, ఆత్మీయులు తదితరులు పాల్గొని అభినందించారు.

ఎంఈఓ గా బాధ్యతలు స్వీకరిస్తున్న విడపు శ్రీనివాస్..





