మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా DM&HO ఆదేశాల మేరకు క్షయ నివారణ విభాగం మరియు టీబి అలర్ట్ ఇండియా -ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్ట్ వారి సహకారం తో చెల్పూర్ PHC వైద్యాధికారి ఆధ్వర్యంలో ఈరోజు హుజురాబాద్ మండలం పరిషత్ కార్యాలయంలో టీబి చాంపియన్స్ కు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి , డిప్యూటీ DMHO డాక్టర్ చందు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ క్షయ వ్యాధితో బాధపడేవారు తగు జాగ్రత్తలు వహించడం వల్ల ఇతరులకు వ్యాధి సంక్రమించకుండా ఉంటుందని సూచించారు. ప్రభుత్వం క్షయ వ్యాధికి ఉచిత వైద్యం అందిస్తుందని లక్షణాలు ఉన్నవారు అశ్రద్ధ వహించకూడదు వెంటనే నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ DMHO డాక్టర్ చందు మాట్లాడుతూ అందరు టిబి వ్యాధి పైన అవగాహన కలిగి వుండాలని మంచి ఆహారం తీసొకొవాలని వ్యాధి నివారణలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమం కొరకు హెల్త్ సబ్ సెంటర్ వారీగా PHC సిబ్బంది సహకారంతో క్షయ వ్యాధితో పోరాడి గెలిచిన వారిని ఎంపిక చేసి వారికి క్షయ వ్యాధి నివారణపై శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం వారిచే గ్రామాలలో టిబి వ్యాధి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని మరియు గ్రామంలో క్షయ వ్యాధితో బాధపడుతున్న వారిలో ధైర్యం నింపుతూ వారిని వ్యాధి నుండి విముక్తులను చేయడం జరుగుతుందని చెల్పూర్ PHC వైద్యాధికారి డాక్టర్ మధుకర్ అన్నారు. ఈ కమ్యూనిటీ ఎంగేజిమెంట్ కార్యక్రమాల ద్వారా కరీంనగర్ జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా మార్చడమే ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం అని ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మామిండ్లవాడ సబ్ సెంటర్ డాక్టర్ జరీనా, హుజురాబాద్ టియు STS శ్రీనివాస రెడ్డి, హెల్త్ సూపెర్వైజర్ సమ్మయ్య, సత్యం, నిశాంత్ మరియు టిబి అలెర్ట్ ఇండియా సిబ్బంది పాల్గొన్నారు.