మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
కమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ సింగాపురంలో జరుగుతున్న ఆరు రోజుల అటల్ శిక్షణ కార్యక్రమము శనివారం ముగింపు సమావేశం జరిగింది. కళాశాల డైరెక్టర్ డాక్టర్ శంకర్ అధ్యాపకులు ఉద్దేశించి మాట్లాడుతూ సాంకేతిక నిపుణుల యొక్క సేవలు పారిశ్రామిక రంగానికి ఎంతో అవసరము అధ్యాపకులు సాంకేతిక నిపుణులతో నిరంతరము చర్చించి సమాజంలో ఉన్న సాంకేతిక సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని అన్నారు. పారిశ్రామికవేత్తలకు, శాస్త్రవేత్తలకు విషయ పరిజ్ఞానము చాలా ఉంటుందని వారి యొక్క విజ్ఞానాన్ని అధ్యాపకులు నేర్చుకొని విద్యార్థులకు బోధించినచో పరిశ్రమకు కావలసిన నైపుణ్యములు కలిగిన విద్యార్థులను తయారు చేయటం సులభం అవుతుందని అన్నారు. ఒక అధ్యాపకుడు వృద్ధిలోకి రావాలంటే బోధన ప్రధానమైనది అధ్యాపకుడు ఇటువంటి కార్యశాల లో విషయ పరిజ్ఞానం నేర్చుకొని కొన్ని ప్రయోగాత్మక వివరణలు, విద్యార్థులకు బోధించినట్లైతే విద్యార్థుల విజ్ఞానము పెరుగుతుందని, చదువు చాలా సులభం అవుతుందని అన్నారు. ఇటువంటి కార్యశాలలకు హాజరు అయినప్పుడు అధ్యాపకులు ఎక్స్పర్ట్ లెక్చరర్స్ దగ్గర వారి వివరాలు తీసుకొని భవిష్యత్తులో వారిని సంప్రదించి, గొప్ప గొప్ప ప్రాజెక్టులు చేయగలరని అన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వారు స్టాట్ అప్ అనగా చిన్న పరిశ్రమల స్థాపనలను విరివిగా ప్రోత్సహిస్తున్నది, అందుకు తగిన ఆర్థిక సహాయము చేస్తున్నది ఇటువంటి స్టార్ start up మొదలు పెట్టాలంటే అధ్యాపకులు గాని విద్యార్థులకు గాని ఎక్స్పర్ట్స్ యొక్క సహాయ సహకారాలు అవసరము అన్నారు. అందువలన కారేశాలకు హాజరైన అధ్యాపకులు ప్రతి ఒక్క ఎక్స్పర్ట్ కాంటాక్ట్ లో ఉండవలెనని అన్నారు. ముఖ్యముగా రాబోయే కాలంలో పర్యావరణ సహిత శక్తి ఉత్పాదనకు పెద్దపీట ఉంటుందని అన్ని విధాల సహాయ సహకారాలు అందుతాయని విద్యార్థులు అధ్యాపకులు రెన్యూవబుల్ ఎనర్జీ మీద పరిశోధనల చేయాలని అన్నారు. కళాశాల రిజిస్టర్ మరియు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇమానిటీస్ అండ్ సైన్స్ వి రాజేశ్వరరావు మాట్లాడుతూ అధ్యాపకులు నిరంతరము శాస్త్ర పరిజ్ఞానాన్ని నేర్చుకోవడం వలన విద్యార్థులకు మరింత సమర్థవంతంగా బోధించి విద్యార్థుల యొక్క ఉన్నతికి కృషి చేయాలి అన్నారు. ఈ కార్యశాల సమన్వయకర్త డీల్ స్టూడెంట్ అఫైర్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ యోగేష్ పుండలి మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ను పిలిపించామని అందరూ అధ్యాపకులకు అర్థమయ్యే స్థాయిలో బోధించారని అందరికీ రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమం సహా డాక్టర్ ఏ కొమురయ్య ఈ కార్యశాలలో జరిగిన బోధన శిక్షణ కార్యక్రమము నివేదిక అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల నుండి పాల్గొన్న అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.