
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ శివారులోని కాకతీయ కెనాల్ నీటిలో కొట్టుకుపోతున్న మృతదేహం ఆచూకీ లభ్యమైనది. గురువారం కాకతీయ కెనాల్ లో హుజురాబాద్ పట్టణ శివారులో వరంగల్ రోడ్ లో గల కాలువలో మృతదేహం నీటిలో కొట్టుకుపోతుండగా గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో, నీటి ప్రవాహాన్ని అధికారులు తగ్గించారు. దీంతో నీటిలో కొట్టుకుపోతున్న మృతదేహం హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి శివారులో ఆగింది. కాగా మృతుడు హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన పల్లకొండ గణేష్ గా పోలీసులు గుర్తించారు. గణేష్ కాలువలో ప్రమాదవశత్తు పడి మృతి చెందాడా.. మరి ఏదైనా ఉందా ? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఎస్సారెస్పీ ప్రధాన కారులో కొట్టుకు వెళ్లిన మృతదేహం..


పల్లకొండ గణేష్(ఫైల్ ఫోటో)





