
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, ఫిబ్రవరి 26: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని 26వ వార్డులో పేద కుటుంబాలకు చేయూత గా ఉంటామని ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన భరోసా మేరకు కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య – నర్సింహారెడ్డి దంపతులు ఓ నిరుపేద కుటుంబంలో వివాహానికి ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. 26వ వార్డుకు చెందిన నారోజు రాజ్యలక్ష్మి – రత్నాచారి దంపతుల కుమార్తె తరుణి వివాహము కందుకూరి రాజేందర్ తో గురువారం స్థానిక మధువని గార్డెన్ లో జరిగింది. ఈ వివాహ వేడుకకు కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య నర్సింహారెడ్డి దంపతులు హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి రూ.10,116 /- ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. పేదింటి వివాహానికి ఆర్థిక సహాయం అందించిన కౌన్సిలర్ లావణ్య నర్సింహా రెడ్డి దంపతులను పలువురు అభినందించారు.


26వ వార్డుకు చెందిన పేదింటి వివాహానికి రూ.10,116 అందిస్తున్న కేసిరెడ్డి లావణ్య నర్సింహారెడ్డి దంపతులు





