
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ పట్టణ శివారులోని కేసి క్యాంపు సమీపంలో వరంగల్ – కరీంనగర్ జాతీయ రహదారి పై గురువారం అదుపుతప్పిన లారీ బైకును చెట్లను ఢీకొంది. ప్రకాశం జిల్లా కందుకూరు నుండి బళ్లార్ష కు లారీలో కర్ర లోడ్ తో లారీ హుజురాబాద్ వద్ద డ్రైవర్ కు ఫిట్స్ రావడంతో అదుపు తప్పింది. దీంతో ఎదురుగా ఉన్న నాలుగు చెట్టులకు, బైక్ ను ఢీకొని ఫర్నిచర్ షాపు ముందు ఉన్న ఫర్నిచర్ పైనుండి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో డ్రైవర్ కు స్వల్ప గాయాలు కాగా వెంటనే అతడిని108 వాహనంలో ప్రభుత్వ హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించారు. రోడ్డు పక్కన ఉన్న నాలుగు భారీ చెట్లను ఢీ కొట్టి ఫర్నిచర్ షాప్ మొత్తం ధ్వంసం చేస్తూ రోడ్డు పక్కన నిలిపి ఉన్న వాహనాన్ని ఢీ కొట్టుకుంటూ లారీ దూసుకెళ్లిన తీరు చూపరులను భయభ్రాంతులకు గురిచేసింది. ఆ సమయంలో రోడ్డుకు అవతలి సైడు ఓ కళ్యాణ మండపంలో ఒక వివాహం జరుగుతుండగా లారీ ఇటు బదులు అటు సైడ్ వెళ్లి ఉంటే భారీగా ఆస్తి, ప్రాణ నష్టాము జరిగి ఉండేదని స్థానికులు వాపోయారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.




లారీ రోడ్డు ప్రమాద దృశ్యాలు…





