
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపాలిటీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి అయిదుగురు బిజెపి కౌన్సిలర్లు కోలుగురి సుమలత (పదో వార్డు), దామెర అనూష (20వ వార్డు) పంజాల మనోజ్ గౌడ్(21వ వార్డు) తూర్పాటి లక్ష్మిదుర్గ(23వ వార్డు), కొండా ప్రశాంతి (25వ వార్డు)లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారికి కౌన్సిలర్ గా అధికారిక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రోoటాల సుహాసిని, వైస్ చైర్ పర్సన్ గూడూరు అంజలి, ఆర్ ఐ ఈ రమేష్, టిపిఓ అశ్విని గాంధీ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






—బిజెపి కౌన్సిలర్లకు జిల్లా అధ్యక్షుడు అభినందన
హుజురాబాద్ మున్సిపాలిటీలో విజయం సాధించిన బిజెపి కౌన్సిలర్లకు బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అభినందించి, శాలువాలతో సత్కరించీ పూల మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ….హుజురాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం గళం విప్పాలని అన్నారు. హుజురాబాద్ మున్సిపాలిటీ శివారులో ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డ్ ను అడ్డుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పైళ్ల వెంకటరెడ్డి, బిజెపి హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, నాయకులు గంగిశెట్టి రాజు, నల్ల సుమన్, దామెర అనురాగ్, మంచికట్ల మురళి, నాంపల్లి సుమన్, తిప్పబత్తిని రాజు, నరేందర్ రావు, దేవేందర్ రావు, అంకతి వాసు, చైతన్య రెడ్డి, కుమార్ గౌడ్, శశిధర్, ప్రభాకర్, సబ్బని రమేష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్లకు శాలువాలు కప్పి పూల మొక్క ఇచ్చి అభినందనలు తెలుపుతున్న జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి..






