
.మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు, ఓసిల సంక్షేమం కోసం జాతీయ స్థాయి ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించటానికి రైతు భాగస్వామ్యంతో ఏర్పడే ప్రత్యేక రైతు చట్టం తేవాలని, ఈడబ్ల్యూఎస్ బ్యాక్ లాగ్ పోస్టులను ఈడబ్ల్యూఎస్ వారితోనే వెను వెంటనే భర్తీ చేయాలని, అమలవుతున్న రిజర్వేషన్లలో క్రిమిలేయర్ పద్దతి అమలు చేయటానికి ప్రత్యేక చట్టం తేవాలని, ఈడబ్లూఎస్ అర్హతకు 10 లక్షల వార్షిక ఆదాయపరిమితి విధించాలని రైతు భీమా వయో పరిమితిని 70 ఏళ్లకు పెంచాలని కోరుతూ ఓసి జేఏసీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో 23న జాతీయ స్థాయి భారీ మహా ధర్నా విజయవంతంగా నిర్వహించి డిల్లి నుండి హైదారాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు చందుపట్ల నరసింహరెడ్డి, సలహాదారు రావుల నరసింహరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రాగిడి రవీందర్ రెడ్డి, నల్లా రాజిరెడ్డి, కంది సందీప్ రెడ్డితో పాటు ఐకాస జాతీయ రాష్ట్ర నాయకులకు స్ధానిక రాష్ట్ర ఐకాస, వివిధ జిల్లాల నాయకులు ఘన స్వాగతం పలికారు. డిమాండ్ల నెరవేరే వరకు నిరంతర పోరాటం చేస్తామనీ ప్రభుత్వాలకు ఆరు నెలల గడువు ఇస్తున్నామని ఇప్పటికైనా ప్రభుత్వాలు తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, గోపి జైపాల్ రెడ్డి
లు డిమాండ్ చేశారు.


విమాన ఆశ్రయంలో ఓసి జేఏసీ నేతలకు ఘన స్వాగతం పలుకుతున్న ఓసి ఐకాస రాష్ట్ర నాయకులు






