Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త క్యాస ఉపేందర్ కుమారుడు డాక్టర్ సాయి లఖన్ – డాక్టర్ జిశిత ల వివాహం బుధవారం హైదరాబాదులో జరుగగా నూతన వధూవరులను హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆశీర్వదించారు. అలాగే ఆయనతోపాటు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ బాబు, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, మాజీ కౌన్సిలర్ రమాదేవి, మాజీ సర్పంచ్ ప్రతాప శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టు పరంకుశం కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తదితరులు..





