
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ధనార్జనే ధ్యేయంగా గాకుండా, ప్రజల అవసరాలు, మంచి చెడుల ను అవగతం చేస్తూ గత 2006 నుండి 20 ఏళ్లుగా ఆ వార్డు ప్రజల మన్ననలు పొందడం చిన్న విషయం కాదు, ఎమ్మెల్యే, ఎంపీ అంతకంటే పెద్ద పదవుల్లో 6 సార్లు, అంతకంటే ఎక్కువగా గెలువచ్చు కానీ అందులో కౌన్సిలర్ (వార్డు మెంబర్) కావడం, అందులో 4 సార్లు అలవోకగా పాలక పార్టీ లో ఉన్న, ప్రతి పక్షంలో ఉన్న గెలుపొందడం ఆ దంపతులు కేసిరెడ్డి లావణ్య – నర్సింహారెడ్డిలకే సాద్యం అయినది, అంటే అతియోశక్తి కాదు. 2006లో వార్డులో గల ఒక అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న నర్సింహారెడ్డి పాత్రికేయ వృత్తిలో ఉండి, అప్పటి కే రాజకీయ సంబంధాలు కలిగి ఉండడంతో హుజురాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా 2006లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ నుండి మాజీ మంత్రి కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావుకు సన్నిహితుడిగా ఉంటూ మహిళ కు రిజర్వేషన్ కలిసి రావడంతో కేసిరెడ్డి లావణ్య నామినేషన్ వేసి వార్డు సభ్యులుగా కేవలం ఒకే ఒక్క ఓటుతో విజయం సాధించడం ద్వారా హుజురాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి పంచాయతీలో ప్రవేశించారు. తదనంతరం 2014లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలో టీఆర్ఎస్ నుండి హుజురాబాద్ నగర పంచాయతీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి రికార్డు కొట్టారు. అదే విదంగా 2020లో జరిగిన ఎన్నికల్లో కూడా ఏక పక్షంగా గెలుపొందారు. 2026లో బీఆర్ఎస్ ప్రతి పక్షం, ఇతర పార్టీల నుండి ఒత్తిడి ఉండి కాంగ్రెస్, బీజేపీలు ఈ సీటు ఎలాగైనా కైవసం చేసుకోవాలని చూసిన ఎన్నికల్లో లావణ్య గెలుపు సునాయసంగా విజయం సాధించడం హుజూరాబాద్ చరిత్రలో రికార్డుగా చెప్పవచ్చు. హుజురాబాద్ స్థానిక పరిపాలన పుట్టిన నుండి ఒకే వ్యక్తి నాలుగో సారి గెలుపొందడం ఇదే రికార్డుగా చెప్పవచ్చు. దీనికి స్పందించిన కేసిరెడ్డి లావణ్య – నర్సింహారెడ్డి వారి మాటల్లోనే ప్రముఖ వాణిజ్య వ్యాపార కూడలి అయిన 26 వార్డు ఎక్కువగా వ్యాపారులు, బిజినెస్ జరుగుతుంది. మెడికల్ షాప్స్, డాక్టర్లు, ఉంటారు. బంగారు దుకాణాలు, బట్టల షాప్ లు, ఆయిల్, రైస్ మిల్లుల వ్యాపారులు కూడలి, హోటళ్ళు, స్వీట్ షాపులు, బేకరి, పోలీస్ స్టేషన్, పోస్టాఫీస్, టలిపోన్ ఎక్సేంజ్ ఇతర ఎన్నో రకాల బిజినెస్ లకు ఆలవాలం ఈ వార్డు, దిన్ని శుభ్రంగా ఉంచడం, పరిశుద్ధం పనులకు సంపూర్ణ సాకారం, హరిత హారంలో చెట్లు పెంచడం, పించన్లు, రేషన్ కార్డులు, ఇతర ప్రభుత్వ స్కిం ల ద్వారా ప్రతి ఒక్కరికీ లబ్ధి పొందే విధంగా చూడడంలో లావణ్య దంపతులు సక్సెస్ అయ్యారు. ఏ పని ఉన్న దాన్ని పూర్తయి వరకూ చూపించడంలో వారికి వారే సాటి, సమస్య దగ్గర కు వారే వచ్చి పరిష్కారం చేస్తారు. వార్డు లో సుందరీకరణ, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, మిషన్ భగీరథ పథకం కింద ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు, కులమత భేదం లేకుండా పని చేయడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి వార్డు లో నిత్యం ఒక సభ్యుడిగా ఉంటూ లావణ్య – నర్సింహారెడ్డిలు ప్రతి ఎన్నికల్లో ను విజయడుంధుభి మ్రోగించడం జరుగుతుంది. కరోనా కాలంలో ఐతే వార్డు ప్రజల్లో మమేకమై పరిశుద్ధం పనుల విషయంలో జాగ్రత్త లు తీసుకున్నారు. కరోనాలో మున్సిపల్ సిబ్బందికి వార్డు వ్యాపారులు, ప్రజల సహకారంతో రూ.4 లక్షల రూపాయలు విలువైన సరుకులు పంపిణీ చేశారు. 2016కి ముందు నీటి వసతి గూర్చి ఎంతో శ్రమించారు. నిత్యం వాటర్ ట్యాంకర్లు ద్వారా వార్డులో ఇంటింటికి సదుపాయం కల్పించి ఔరా అనిపించారు. వార్డులో నీటి కొరత ఉన్న పరిస్థితి ల్లో బోర్ సౌకర్యం కల్పించి వార్డు లోని కుటుంబాలకు నీటి సరఫరా కోసం ఎంతో శ్రమించారు.
ముఖ్యంగా అవినీతి లేదు, హరితహారంలో అవార్డు,
సీసి రోడ్లు డ్రైనేజ్ సౌకర్యంలో 💯 శాతం పూర్తి,
మిషన్ భగీరథ ఇంటింటికి ఏర్పాటు చేయడం
తో పాటు నిత్యం ప్రజల్లో కేసిరెడ్డి ఉండడం వల్ల నాలుగు సార్లు సునాయసంగా గెలుపొంది , ఈ రోజు రికార్డులు సృష్టించే అవకాశం లభించింది. జగన్నాథ నాయుడు నుండి మొదలు కుంటే ఇప్పటి వరకూ అప్పటి గ్రామ పంచాయతీ , ప్రస్తుత మున్సిపల్ లో నాలుగు సార్లు గెలుపొందిన మొదట రికార్డుగా చెప్పవచ్చు, కాగా 4వ సారి గెలిచిన సందర్భంగా వార్డు ప్రజలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి భోజనం ఏర్పాటు చేసి మన్నన పొందారు.

—ప్రజలకు అంకితం
4 సార్లు గెలిచిన ఈ రికార్డును 26వ వార్డు ప్రజలకు అంకితం చేస్తున్నట్లు గా లావణ్య – నర్సింహారెడ్డిలు పేర్కొన్నారు. వార్డు ప్రజల రుణం తీర్చుకోలేనిదని అన్నారు. మూడు సార్లు వార్డుకు అవార్డులు వచ్చినట్లు తెలిపారు. ఇక ముందు వార్డు ప్రజల సహకారంతో అభివృద్ధితో పాటు పారిశుద్ధ్య పనులు, ఇతర కార్యక్రమాలు జయప్రదంగా నిర్వహిస్తామని వెల్లడించారు.
















లావణ్య- నరసింహారెడ్డి విజయంలో కొన్ని చాయ చిత్రాలు…





