Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మునిసిపాలిటీలోని 19వ వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రోoటాల సుహాసిని అన్నారు. మంగళవారం 19వ వార్డులో ఆమె పర్యటించి సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీలు పూర్తిస్థాయిలో నిర్మించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో 19వ వార్డు కౌన్సిలర్ గోస్కుల రాజ్ కుమార్, ప్రజలు పాల్గొన్నారు.

19వ వార్డులోని ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకుంటున్న మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని..





