Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లోని మామిండ్లవాడకు చెందిన చింత సునీత(35) హత్య కేసులో నిందితుడిని 36 గంటల్లో కేసును చేదించి అరెస్ట్ చేసినట్లు హుజూరాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి తెలిపారు. సోమవారం హుజూరాబాద్ పోలీసు స్టేషన్ లో హత్య కేసు వివరాలను ఆమె వెల్లడించారు.

హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చింత సునీత (35) గత కొంతకాలంగా హుజూరాబాద్ పట్టణం మామిండ్లవాడలో నివాసం ఉంటుంది. ఆమె భర్త కుమార్ కొన్నాళ్ల క్రితం మృతి చెందగా, గత ఐదు సంవత్సరాలుగా పట్టణంలోని జమ్మికుంట రోడ్డులో ఉండే మోతే కిరణ్ తో సహజీవనం చేస్తుందన్నారు. వీరిద్దరు మామిండ్లవాడ గ్యాస్ గోదాం సమీపంలో ఓ అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారనీ, సునీత తన పక్కన ఉన్న ఇంట్లో ముతోజు భాగ్య అనే మహిళతో స్నేహం పెంచుకుందన్నారు. తరచూ వీరిద్దరు కలిసి తిరుగుతుండటంతో సునీత వ్యభిచారం చేస్తుందనే అనుమానం కిరణ్ కు కలిగిందన్నారు. ఈ అనుమానంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవన్నారు. ఈ నెల 10న కిరణ్, సునీత ఇద్దరు కలిసి మద్యం సేవింవారన్నారు. ఇదే విషయమై మళ్లి గొడవ జరగడంతో ఆగ్రహానికి గురైన కిరణ్ ముందుగా సునీత గొంతును చేతులతో పిసికి, అనంతరం చిర ముక్కతో గొంతు బిగించి, కాలితో మెడపై తొక్కి హత్య చేశాడన్నారు. ఎవరికి తనపై అనుమానం రాకుండా ఉండేందుకు సునీత మృతదేహాన్ని ఎత్తుకొని వెళ్లి తన స్నేహితురాలైన ముతోజు భాగ్య ఇంటి సమీపంలోని బావిలో పడేశాడన్నారు. సునీత ధరించిన లో దుస్తులు (ప్యాంట్, డ్రాయర్) ను బావికి సమీపంలోని చెట్టు వద్ద పడవేసి, అక్కడి నుంచి పరారై కరీంనగర్ కు వెళ్లిపోయాడని పేర్కొన్నారు. సిఐ కరుణాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 13న సోమవారం హుజూరాబాద్ కు తిరిగి వచ్చాడనే పక్కా సమాచారం అందటంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, స్వచ్ఛందంగా నేరాన్ని ఒప్పుకున్నాడన్నారు. సంఘటన జరిగిన ఇంటిని, మృతదేహాన్ని పడవేసిన బావిని, దుస్తులు పడవేసిన స్థలాన్ని చూపించాడన్నారు. సంఘటన స్థలం నుంచి పగిలిన గాజులు, గాజు ముక్కలు, పుస్తెల పూసలు, కాలి పట్టి తదితర కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే బావి సమీపంలో పడవేసిన మృతురాలి లో దుస్తులను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, కేసు దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు. మహిళ హత్య కేసును కేవలం 36 గంటల్లోనే ఛేదించి నిందితుడిని పట్టుకున్నామన్నారు. సిఐ కరుణాకర్, ఎస్ఐలు రవి, శ్రీనివాసరావు, సిబ్బంది మోహన్, అవినాష్, మహేందర్, శ్రీధర్, అనిల్ లను ఏసిపి అభినందించారు.





