
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని శనివారం హుజూరాబాద్ పట్టణంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా అధిక జనాభా వల్ల నష్టాల గురించి నినాదాలు చేశారు. అనంతరం జనాభా పెరుగుదలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ…అధిక జనాభా వలన కలిగే అనర్ధాలు, కృత్రిమ గర్భనిరోధక పద్ధతులు, శాశ్వత గర్భ నిరోధక పద్ధతులు గురించి తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చెల్పూర్ పిహెచ్ సి వైద్యాధికారి డాక్టర్ తులసీదాస్, హుజురాబాద్ బస్తీ దవఖాన డాక్టర్ జరీనా, జిల్లా ఆరోగ్య బోధకులు పంజాల ప్రతాప్ గౌడ్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సదానందం, హెచ్ ఇ ఓ విజేందర్ రెడ్డి, ఎండి అజీజ్, ఆశా కార్యకర్తలు, బాలింతలు పాల్గొన్నారు.

ఏరియా ఆసుపత్రి నుంచి ర్యాలీ తీస్తున్న వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు..

జనాభా పెరుగుదల అవగాహన సదస్సులో మాట్లాడుతున్న జిల్లా ఆరోగ్య బోధకులు పంజాల ప్రతాప్ గౌడ్





