
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : మహిళలు స్వయం ఉపాధి పొందడంతో పాటు అభివృద్ధిలో ముందుండాలని డిఆర్ డిఓ గీత అన్నారు. శుక్రవారం హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామంలో డిఆర్ డిఏ ఆధ్వర్యంలో శ్రీ సౌమ్య మండల మహిళా సమాఖ్య కార్యాలయాన్ని, కమ్యూనిటీ మేనేజ్డ్ ట్రైనింగ్ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. డిఆర్ డిఏ ఆధ్వర్యంలో మహిళలకు అందిస్తున్న పలు కార్యక్రమాల గురించి మహిళలకు ఆమె వివరించి తెలిపారు. మహిళలు స్వయం ఉపాధితో మెరుగైన జీవితం గడిపేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఐకెపి ఎపిఎం లతా మంగేశ్వరి, డీపీఎం కరుణాకర్, వేణు మండల సమాఖ్య అధ్యక్షులు సుకన్య, మండల సమాఖ్య ఓబీలు, వీవో, ఓబీలు విఓఏలు, సిబ్బంది పాల్గొన్నారు.


.శ్రీ సౌమ్య మండల మహిళా సమాఖ్య కార్యాలయాన్ని, కమ్యూనిటీ మేనేజ్డ్ ట్రైనింగ్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న డిఆర్ డిఓ గీత

మహిళలకు శిక్షణ గురించి వివరిస్తున్న డిఆర్డిఓ గీత





