
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ 55వ జన్మదినాన్ని పురస్కరించుకుని ముందస్తు జన్మదిన వేడుకలను ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామ ZPHS హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్ కుమార్ వీర అభిమాని మట్ట పవన్ రెడ్డి ఆధ్వర్యంలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులను పంపిణీ చేశారు.


ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ సీనియర్ నాయకుడు మట్ట పవన్ రెడ్డి మాట్లాడుతూ, “విద్యే సమాజ అభివృద్ధికి పునాది” అనే భావనతో ఈ చిన్న సేవా కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా, బండి సంజయ్ ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో నిండి దీర్ఘాయుష్షుతో ఉండాలని, ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనకు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మట్ట పవన్ రెడ్డి, ఉప్పుల శ్రీనివాసరెడ్డి, బచ్చల భానుచందర్, అరవింద్ రెడ్డి, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.






